తెలంగాణ

Harish Rao: 22ఏ వివాదం.. లక్షలాది మందితో అసెంబ్లీని ముట్టడిస్తాం-రేవంత్ సర్కార్‌కు హరీశ్ రావు వార్నింగ్

రచన: NK••6 నిమిషాల పఠనం

22ఏ నిషేధిత భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం రాజకీయాల్లో హీట్ పెంచేసింది. కాంగ్రెస్ సర్కార్ ను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. 22ఏ బాధితుల పక్షాన నిలిచిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. బేషరతుగా 22ఏ జాబితా నుంచి నిషేధిత భూములను తొలగించాలని రేవంత్ సర్కార్ ను హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Harish Rao: 22ఏ నిషేధిత భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం రాజకీయాల్లో హీట్ పెంచేసింది. కాంగ్రెస్ సర్కార్ ను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. 22ఏ బాధితుల పక్షాన నిలిచిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. బేషరతుగా 22ఏ జాబితా నుంచి నిషేధిత భూములను తొలగించాలని రేవంత్ సర్కార్ ను హరీశ్ రావు డిమాండ్ చేశారు.

అసెంబ్లీ సమావేశాల నాటికి నిషేధం తొలగించాల్సిందేనని తేల్చి చెప్పారు. లేదంటే లక్షలాది మంది 22ఏ బాధితులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల ప్రజల పక్షాన 22ఏ పై పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అంటేనే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 22ఏపై విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు.

సెప్టెంబర్ 7 డెడ్ లైన్..

''సెప్టెంబర్ 7వ తేదీలోగా ఏ భూములైతే నిషేధిత జాబితాలో పెట్టారో.. బేషరతుగా వాటని తొలగించాలి. లేదంటే లక్షలాది మంది 22ఏ బాధితులతో (రైతులు, ప్రజలు) అసెంబ్లీ ముట్టడికి కూడా మేము సిద్ధమని హెచ్చరిస్తున్నాం. బీ కేర్ ఫుల్. వెంటనే తీయండి. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించండి. అసెంబ్లీ లోపల, బయట కూడా ప్రజల పక్షాన పోరాడతాం. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక 22ఏ నిషేధిత భూముల అంశం మీద ఎంక్వైరీ జరిపి ఈ తప్పునకు బాధ్యులను శిక్షిస్తాం'' అని హరీశ్ రావు హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ లో 22ఏ బాధితులను హరీశ్ రావు కలిశారు. ఈ సందర్భంగా మీకు అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.

బొందల గడ్డ కూడా వదలవా?

నాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని అని రేవంత్ పదే పదే చెబుతారు. రియల్ ఎస్టేట్ గురించి బాగా తెలిస్తే ప్రజల కష్టాలు తొలగించాల్సింది పోయి పీల్చి పిప్పి చేస్తావా? ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో వెయ్యి గజాల పార్కును కూడా వదల్లేదు. అమ్మకానికి పెట్టారు. భూముల కేంద్రంగా రేవంత్ పాలన చేస్తున్నారు. భూములు, పార్కులు, ప్లాట్లు అన్నీ అమ్మేస్తున్నారు. భవిష్యత్తులో బడి కట్టాలన్నా, గుడి కట్టాలన్నా భూమి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములను రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నారు. ఉన్న జాగాలన్నీ అమ్మేస్తే.. రేపు ఏం చేస్తారు. బడి, గుడి, పార్కు, ఆసుపత్రి కట్టాలంటే ఎలా? బొందల గడ్డకు కూడా జాగా లేకుండా చేస్తాడేమో రేవంత్ రెడ్డి.

తప్పు మీది.. శిక్ష ప్రజలకా?

కనిపించిన భూముల్లా అమ్ముతానంటే ఎలా? నిషేధిత జాబితాలో భూములు చేర్చి ప్రజలను హింసిస్తారా? ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారా? మీరు చేసిన తప్పునకు ప్రజలకు శిక్ష ఎందుకు? ఆన్ లైన్ లో దరఖాస్తులు ఎందుకు పెట్టాలి? ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి వారికి నిద్ర లేకుండా చేస్తున్నారు.

రేవంత్ పాలనలో ఆస్తుల విలువ ఢమాల్

కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులకే కాదు ప్రజల ప్రాణాలకూ రక్షణ లేకుండా పోయింది. నీ హైడ్రా దెబ్బకు, 22ఏ దెబ్బకు హైదరాబాద్ లో, తెలంగాణలో ఆస్తుల విలువ పడిపోయింది. కేసీఆర్ హయాంలో ఆస్తుల విలువ పెంచారు. రేవంత్ రెడ్డి వచ్చాక మొత్తం పడిపోయింది. ఈ తప్పు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒక్కరే కాదు రేవంత్ రెడ్డి కూడా చేశారు'' అంటూ నిప్పులు చెరిగారు హరీశ్ రావు.

#Harish Rao#22A Lands#22A Prohibited Lands#Cm Revanth Reddy#Telangana Government#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి