తెలంగాణ

TG : రాష్ట్రంలో అమ్మకానికి గురుకుల సీట్లు?

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరో సంచలన విషయం వెలుగుచూసింది. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలోని సీట్లను కొందరు అక్కమార్కులు అమ్ముకుంటున్నట్టు సమాచారం. ఈ అకడమిక్ ఇయర్‌లో విద్యార్థుల అడ్మిషన్లు రాక ఖాళీగా ఉన్న సీట్లను దళారుల సాయంతో అధికారులు విక్రయిస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో మరో సంచలన విషయం వెలుగుచూసింది. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలోని సీట్లను కొందరు అక్కమార్కులు అమ్ముకుంటున్నట్టు సమాచారం. ఈ అకడమిక్ ఇయర్‌లో విద్యార్థుల అడ్మిషన్లు రాక ఖాళీగా ఉన్న సీట్లను దళారుల సాయంతో అధికారులు విక్రయిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వ పాఠశాల సీట్లను అమ్ముకోవడం ఏంటని కొందరు విమర్శిస్తుండగా.. అర్హులైన వారికి కేటాయించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకివెళితే.. గురుకుల సొసైటీల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో, నెలన్నర రోజుల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాల స్థాయిలో సరైన సమాచారం లేకపోవడంతో, అనేక జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లోని గురుకుల ప్రధాన కార్యాలయం ఎదుట సీటు కోసం తల్లిదండ్రుల పడిగాపులు కాస్తున్నట్టు సమాచారం.

https://x.com/TeluguScribe/status/2092125494707900671?s=20

అయితే, అధికారులు తల్లిదండ్రులతో మాట్లాడకుండా వారిని లోపలికి కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే అధికారులు కొందరు దళారులను ఏర్పాటు చేసుకుని ఒక్కో గురుకుల సీటుకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు రేటు కట్టి వసూళ్లు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలను గురుకులాల్లో చేర్చేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ వద్ద డబ్బులు వసూలు చేయడం సరికాదని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని అర్హులైన పేద విద్యార్థులకు సీటు ఇవ్వాలని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉండగా, గతంలో గురుకులాల సెక్రెటరీ సైతం తనకు కేటాయించిన ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు కార్యాలయానికి రావడం, అధికారి లేరని తెలుసుకుని తిరిగి ఇంటికి చేరుకోవడం,మరల రావడం ఇదే తంతుగా కొనసాగిన విషయం తెలిసిందే.

ఇదిలాఉండగా, వెనకబడిన వర్గాల వారికి ఉచితంగా చదువు చెప్పాల్సిన గురుకుల పాఠశాలల్లో సీట్లు అమ్ముకోవడం ఏంటని కొందరు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. అలాగైతే పిల్లల భవిష్యత్ ఏంటని, రేవంత్ సర్కార్ కేవలం యంగ్ ఇండియా పాఠశాలల మీదే ఫోకస్ పెడుతుందా? గురుకులాలు, ప్రభుత్వ బడులు, సోషల్ వెల్ఫేర్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎప్పుడు అప్డేట్ చేస్తారు? వారికి మౌలిక సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారు? సర్కారీ బడులను ఎప్పుడు పట్టించుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

#gurukula schools#seats#sale#telangana#students
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి