తెలంగాణ

Pabbu Sathish: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వకండి- కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్

రచన: NK•••4 నిమిషాల పఠనం

Pabbu Sathish: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టాలని కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ పబ్బు సతీష్ హాజరై స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

* ఎవరికైనా అన్యాయం జరిగితే మా దృష్టికి తీసుకురండి

* శవాలపై పైసలు ఏరుకునే నీచపు బుద్ధిని మానుకోవాలి

* పారదర్శకంగానే డబుల్ బెడ్రూం అర్హుల లిస్ట్

* స్మార్ట్ రేషన్ కార్డుపై మోడీ ఫోటో పెట్టకపోవడం బాధాకరం

* స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ పబ్బు సతీష్ ఘాటు వ్యాఖ్యలు

Pabbu Sathish: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టాలని కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ పబ్బు సతీష్ హాజరై స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

కమలాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు పంచాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం నెలల పాటు కష్టపడి అర్హుల లిస్ట్ తయారు చేసి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చే సమయానికి కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబ్బులు అడిగితే చెప్పుతో కొటండి

డబుల్ బెడ్రూం ఇళ్లు పెట్టిస్తామని చెప్పి డబ్బులు వసూల్ చేస్తున్నారని.. అలా ఎవరైనా డబ్బులు ఇస్తే ఇళ్లు పెట్టిస్తామని ప్రజల దగ్గరకు వస్తే చెప్పుతో కొట్టాలన్నారు. కష్టం చేసుకుని బతకాలే తప్ప నాయకులుగా చలామణి అవుతూ ఫైరవీలు చేస్తూ శవాల మీద పైసలు ఏరుకోవడం మానుకోవాలని హితవు పలికారు. లబ్ధిదారుల వద్దకు ఎవరైనా డబ్బుల కోసం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మోదీ ఫోటోను ప్రజలు గుండెలో పెట్టుకోవాలి

5 కిలోల బియ్యం అందిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను స్మార్ట్ రేషన్ కార్డుపై ముద్రించకపోవడం సిగ్గుచేటని పబ్బు సతీశ్ మండిపడ్డారు. కిలో బియ్యం ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ముద్రించి మోడీ ఫోటో పెట్టకపోవడంతో ఆయన అంటే ఎంత భయం ఉందో తెలుస్తుందన్నారు.

నరేంద్ర మోడీ ఫోటో ముద్రించకపోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదన్నారు. 5 కిలోల బియ్యం అందిస్తున్న మోడీని గుండెల్లో పెట్టుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మోడీ హవాతో బీజేపీ పాగా వేసి అధికారం చేపడుతుందని కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ విశ్వాసం వ్యక్తం చేశారు.

#Pabbu Sathish#Kamalapur Sarpanch#Double Bedroom House#Hanumakonda#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి