తెలంగాణ

Jagga Reddy: సొంత పార్టీ వాళ్లని ఆగాం.. లేదంటే బంతాట ఆడేవాళ్లం- కొండా సురేఖ అంశంపై జగ్గారెడ్డి ఫైర్

రచన: NK••5 నిమిషాల పఠనం

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ అంశంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత నోరు జారారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ ను ప్రశ్నించే స్థాయి సుస్మితకు లేదన్నారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా ఎవరు మాట్లాడినా తప్పే అని తేల్చి చెప్పారు. నా కూతురు అలా కించపరిచేలా మాట్లాడినా తప్పే అన్నారు. కాంగ్రెస్ నాయకులకు పీఏసీలో మాట్లాడే అవకాశం ఉందన్నారు. కానీ, ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు.

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ అంశంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత నోరు జారారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ ను ప్రశ్నించే స్థాయి సుస్మితకు లేదన్నారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా ఎవరు మాట్లాడినా తప్పే అని తేల్చి చెప్పారు. నా కూతురు అయినా సరే.. అలా కించపరిచేలా మాట్లాడితే తప్పే అన్నారు. కాంగ్రెస్ నాయకులకు పీఏసీలో మాట్లాడే అవకాశం ఉందన్నారు. కానీ, ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు.

కొండా సురేఖ, కొండా మురళి పొలిటికల్ పర్సనాలిటీలే.. అందులో ఎలాంటి అనుమానం లేదు.. అంతమాత్రాన ఏది పడితే అది తిట్టొచ్చు అనుకుంటే పొరపాటే అని జగ్గారెడ్డి అన్నారు. తల్లిదండ్రులు పొలిటికల్ పర్సనాలిటీలు కాబట్టి.. కూతురు బయటికి వచ్చి వాళ్లను, వీళ్లను తిడతా అంటే కుదరదన్నారు. కొండా సుస్మిత కొండా సురేఖ కూతురు అని, సొంత పార్టీ వాళ్లే అని ఆగాము.. అదే అపోజిషన్ పార్టీ వాళ్ల కూతురు అయ్యి ఉండుంటే ఈపాటికి బంతాట ఆడే వాళ్లమని జగ్గారెడ్డి హెచ్చరించారు.

''కొండా సుస్మిత నోరు జారారు. ముఖ్యమంత్రిని ప్రశ్నించే, విమర్శించేంత స్థాయికి కొండా సుస్మితకు లేదు. ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా.. నా కూతురు మాట్లాడినా తప్పే. ఇలాంటి దాన్ని ఎవరూ ప్రోత్సహించం. పీఏసీ కమిటీలో మాట్లాడే అవకాశం ఉంది. కానీ బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. కొండా సురేఖ, కొండా మురళి, జగ్గారెడ్డి పొలిటికల్ పర్సనాలిటీస్. అంతమాత్రాన కూతురు, కొడుకు ఊరు మీద పడి ఎవరిని పడితే వాళ్లని తిడతామంటే కరెక్ట్ కాదు.

కొండా సురేఖ కూతురు కాబట్టే ఆచితూచి అడుగు వేయాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ లీడర్ కూతురు కాబట్టే కొంత కామ్ గా ఉండాల్సి వచ్చింది. అదే అపోజిషన్ పార్టీ వాళ్ల కూతురై ఉంటే.. ఈ పాటికి చెడుగుడు ఆడేవాళ్లం. ఇలాంటి సంప్రదాయం ఎవరం కూడా ప్రోత్సహించం. దీనిపై ఎవరూ మాట్లాడొద్దని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ అంశం ఏఐసీసీ పరిశీలనలో ఉంది. ముఖ్యమంత్రిని అలా మాట్లాడటం మూర్ఖత్వమే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కాంగ్రెస్ లో యాక్షన్లు ఉంటాయి, రియాక్షన్లు ఉంటాయి. సారీ చెబితే మాఫీలు కూడా ఉంటాయి'' అని జగ్గారెడ్డి అన్నారు.

#Jagga Reddy#Konda Surekha#Konda Sushmita#Telangana Congress#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి