సినిమా

Sandeep Reddy Vanga: మనం ఎంత ట్రై చేసినా స్పిరిట్‌కి వచ్చేది ‘A’ సర్టిఫికెటే!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Sandeep Reddy Vanga: కొందరు దర్శకులు తీసే సినిమాలకి ఖచ్చితంగా వచ్చేది ఎ సర్టిఫికెట్ అని అర్థమవుతుంది. అలా అంటే అదేదో బూతు సినిమా తీస్తున్నారని కాదు..అలాంటి వైల్డ్ స్టోరీ ఉంటుందని..హింస, రక్తపాతం, ఘాటైన రొమాన్స్ ఉంటాయని. ఇవన్నీ చూసేందుకు ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి..సెన్సార్ అన్నీ వయసుల వారు ఇటువంటి సినిమాలు చూసేందుకు అనుమతివ్వదు. అలాంటి, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, అనిమల్ చిత్రాలతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలలో సెన్షేషనల్ డైరెక్టర్‌గా పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్‌గా త్రిప్తీ దిమ్రీ నటిస్తోంది. టీ సిరీస్-భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. తాజాగా, ఆయన.. మనం ఎంత ట్రై చేసినా స్పిరిట్ సినిమాకి ఎ సర్టిఫికెట్ వస్తుందని ఫన్నీ కామెంట్స్ చేశాడు. దీన్ని, బట్టి ఇది పక్కా వయిలెన్స్ ఎక్కువగా ఉండే సినిమా అని..అర్థమవుతోంది.

'రోమాంచికం'.. ఈవెంట్‌లో సందీప్:

తాజాగా ‘రోమాంచకం’ సినిమా ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్ కి సందీప్ రెడ్డి వంగ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన ‘స్పిరిట్’ సినిమా గురించి మాట్లాడాడు. నేను ఇలాంటి కామెడీ సినిమాలను తీయలేను. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల కంటే ‘స్పిరిట్’లో ఇంకా బలమైన కథ-కథనాలు ఎమోషన్స్ ఉంటాయి. అందుకే, కంటెంట్ విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు. రాసుకున్న కథను పూర్తి 'రా' గా చూపించబోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు సందీప్.

ఇక, ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం, సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం మార్చి 5, 2027 విడుదల లక్ష్యంగా తెరకెక్కుతుంది. ఇలాంటి, సినిమాలకి సెన్సార్ గ్యారెంటీగా ఎ సర్టిఫికెట్ వస్తుందని స్వయంగా తానే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి, తాజాగా సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ కామెంట్స్‌తో స్పిరిట్ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

#Sandeep Reddy Vanga#Spirit#Prabhas#Tripthi Dimri
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి