Raviteja-Yash: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా ఇరుముడి. ఈ సినిమా ఆగస్టు 21న ప్రేకులముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకొని ఊహించని రేంజ్‌లో లాభాలలోకి వచ్చింది. రవితేజ కెరీర్‌లోనే ఇరుముడి సినిమా హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా, అది కూడా రెండు రోజుల్లోనే అనేది చాలా గొప్ప విషయం. ఒకప్పుడు, పోకిరి, గబ్బర్ సింగ్ సినిమాలకి ఇలాంటి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇంకా, చెప్పాలంటే ఆ రెండు సినిమాలని మించే ఇరుముడి ఓపెనింగ్స్ వచ్చాయి.
ఇరుముడిపై టాక్సిక్ ప్రభావం:
బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తున్న ఇరుముడి..లక్షల్లో టికెట్స్ బుక్ అవుతూ అన్నీ సెంటర్స్‌లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. అయితే, టాక్సిక్ సినిమా ఆగస్టు 26 (నేడే) రిలీజ్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. జస్ట్ గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోవడం చూస్తుంటే ఎలాంటి సంచలనాన్ని ఈ సినిమా సృష్ఠిస్తుందో అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఖచ్చితంగా, టాక్సిక్ రిలీజ్ రోజు ఇరుముడి వసూళ్లపై గట్టిగానే ప్రభావం ఉంటుందని అర్థమవుతోంది.
టాక్సిక్ టాక్ తేడా వస్తే ఇరుముడికి కలిసొస్తుంది:
ఒకవేళ యష్ నటించిన టాక్సిక్ సినిమా గనక బ్లాక్ బస్టర్ హిట్ అని టాక్ వస్తే కొద్దిగా ఇరుముడి సినిమా కలెక్షన్స్ రెండు మూడు రోజుల పాటు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అయితే, కంటెంట్ పరంగా రెండిటికీ చాలా తేడా ఉంది. కాబట్టి, ఫ్యామిలీ ఆడియన్స్ రవితేజ సినిమాకే మొగ్గు చూపుతారు. పైగా ఇది మన తెలుగు సినిమా. ఇప్పటికే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాపై విపరీతమైన ఆదరణ కనిపించింది. ఇంకో 100 కోట్లు రాబట్టినా ఆశ్చర్యపోనసరం లేదు. తమిళం, తెలుగులో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
పాన్ ఇండియా వైడ్‌గా టాక్సిక్ సునామీ:
యష్ నటించిన టాక్సిక్ మూవీకి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. మొత్తం 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కేజీఎఫ్ సిరీస్ తో యష్ కి గ్లోబల్ మార్కెట్‌లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో, టాక్సిక్ ఖచ్చితంగా 1500 కోట్ల వసూళ్ళు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. చూడాలి, మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో.


