సినిమా

Tollywood: మహేష్‌తో సినిమా చేయట్లేదు..షాకిచ్చిన అనిల్ రావిపూడి

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబుతో డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా చేయడం లేదంటూ తాజాగా వెల్లడించారు. ఇది, ఒకరకంగా మహేష్ అభిమానులను డిసప్పాయింట్ చేసే వార్త అయినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే సాధ్యపడదని అర్థమవుతోంది. అనిల్ రావిపూడి ఇలా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో నాలుగైదు రోజులుగా వస్తున్న వార్తలకి చెక్ పడింది.

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబుతో డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా చేయడం లేదంటూ తాజాగా వెల్లడించారు. ఇది, ఒకరకంగా మహేష్ అభిమానులను డిసప్పాయింట్ చేసే వార్త అయినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే సాధ్యపడదని అర్థమవుతోంది. అనిల్ రావిపూడి ఇలా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో నాలుగైదు రోజులుగా వస్తున్న వార్తలకి చెక్ పడింది.

వారణాసి తర్వాత మహేష్ దర్శకుడెవరు?

దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వారణాసి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున సంగతి తెలిసిందే. శ్రీదుర్గ ఆర్ట్స్ అధినేత డా.కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ కలిసి దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7వ తేదీన 120 దేశాలలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే, కొన్ని దేశాలను ప్రమోషన్స్ కోసం ఎంచుకున్నారు కూడా.

అయితే, వారణాసి తర్వాత మహేహ్ బాబు చేయబోయో దర్శకుడెవరు అని ఇటీవల అభిమానుల్లో చర్చ మొదలైంది. ప్రచారంలో మాత్రం ముగ్గురు దర్శకుల పేర్లు ఉన్నాయి. వారే సందీప్ రెడ్డి వంగ, బుచ్చిబాబు సానా, అనిల్ రావిపూడి. కానీ, తాజాగా అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. మహేష్ అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయనతో సినిమా చేయడం చాలా ఇష్టం. కానీ, ఇప్పట్లో ఆయనతో సినిమా చేయడం లేదు. దీని గురించి వస్తున్న తప్పుడు వార్తలను ఎవరూ నమ్మొద్దు అని తెలిపాడు.

కాబట్టి, అనిల్ రావిపూడి కాదని తేలిపోయింది. ఇక, మిగిలింది సందీప్ రెడ్డి వంగా, బుచ్చిబాబు. వీరిలో సందీప్ ఆల్రెడీ ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కాబోతుంది. అప్పటికి వారణాసి నుంచి మహేష్ దాదాపు బయటపడతాడు. కాబట్టి, ఈ కాంబో సెట్ అవొచ్చు. అలాగే, పెద్ది తర్వాత కథ రాసుకుంటున్నాడు బుచ్చిబాబు. ఈలోపు కథ గనక మహేష్ కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మహేష్-బుచ్చిబాబు కాంబో కూడా ఓకే. మరి, మహేష్ మనసులో ఉన్న దర్శకుడేవరో అన్నది తెలియాల్సి ఉంది.

#mahesh babu#sandeep reddy vanga#anil ravipudi#buchibabu sana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి