Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా రవితేజ నటించిన ఇరుముడి సినిమా చూసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలో చెప్పలేదిని చెప్పారంటూ ఎమోషనల్ అవుతూ..తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అంతేకాదు, ఇరుముడి సినిమా గురించి స్పెషల్ గా రష్మిక పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ఇరుముడి భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తూ దూసుకుపోతోంది. స్కూల్ టీచర్ల గురించి, స్కూల్ యూనిఫార్మ్ గురించి తప్పుగా చూపించారనే వివాదం చుట్టుముట్టినప్పటికీ, అన్నీ వర్గాల ప్రేక్షకులు సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. రిలీజైన రోజునుంచి ఈరోజు వరకూ బుకింగ్స్‌లో ఇరుముడి చూపిస్తున్న దూకుడు టాలీవుడ్‌లో ఎంతో మంది మేకర్స్‌ను అట్రాక్ట్ చేస్తుంది.
ఇక, ఇప్పటికే, పలువురు సినీ తారలు, స్టార్స్ ఇరుముడి సినిమాను చూసి ఆనందంతో చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే, సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించిన చిత్రబృందం ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు. ఇక, ఇదే క్రమంలో మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్, విజయ్ దేవరకొండ సతీమణి రష్మిక మందన్న ఇరుముడి సినిమాను చూశారు.
ఈ సందర్భంగా రష్మిక ట్విట్టర్ ద్వారా సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపింది. ఇరుముడి సినిమా నాకు ఎమోషనల్ గా ఎంతో కనెక్ట్ అయింది. ఇందులో చూపించినట్టుగానే నేను కూడా ఒక చిన్న ఊరి జీవనం నుంచి వచ్చాను..అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. అంతేకాదు, ఈ సినిమాలో ఎంతోమంది చెప్పుకోలేని మాటల్ని చెప్పించాడు దర్శకుడు.. అని ఎమోషనలయ్యింది.
హీరో రవితేజ సర్ ఈ సక్సెస్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. బేబీ నక్షత్ర నీ నవ్వు నన్ను నవ్వించింది.. అని శుభాకాంక్షలు తెలిపింది. వీరితో పాటు చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ఇంతమంచి సక్సెస్‌ని అందుకోవడానికి అర్హుడు.. ఆయన విషయంలో కూడా చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చింది. ఇలా, ఇరుముడి మూవీ గురించి రష్మిక ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.


