సినిమా

SVC: రవితేజ-దిల్ రాజు.."దాగుడు మూతల దండాకోర్"..2027 సంక్రాంతికి

రచన: Anshu••5 నిమిషాల పఠనం

SVC: టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు నిర్మాణంలో రవితేజ కొత్త చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకి 'దాగుడు మూతల దండాకోర్' అనే టైటిల్‌ని ప్రకటించారు. అంతేకాదు, ఈ సినిమాను 2027, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ కాబోతుందని కూడా అధికారికంగా కన్‌ఫర్మ్ చేశారు. ఇరుముడి సక్సెస్ జోష్‌లో ఉన్న రవితేజ ఇప్పుడు కొత్త చిత్రాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా పట్టాలెక్కిస్తున్నాడు.

SVC: టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు నిర్మాణంలో రవితేజ కొత్త చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకి 'దాగుడు మూతల దండాకోర్' అనే టైటిల్‌ని ప్రకటించారు. అంతేకాదు, ఈ సినిమాను 2027, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ కాబోతుందని కూడా అధికారికంగా కన్‌ఫర్మ్ చేశారు. ఇరుముడి సక్సెస్ జోష్‌లో ఉన్న రవితేజ ఇప్పుడు కొత్త చిత్రాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా పట్టాలెక్కిస్తున్నాడు.

దిల్ రాజు-రవితేజల హ్యాట్రిక్ మూవీ:

గతంలో దిల్ రాజు నిర్మాతగా రవితేజ రెండు సినిమాలు చేశాడు. ఆ సినిమాలే భద్ర.. రాజ ది గ్రేట్. బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా భద్ర. ఈ సినిమాతో రవితేజకి మంచి కమర్షియల్ హిట్..దిల్ రాజుకి నిర్మాతగా-డిస్ట్రిబ్యూటర్‌గా మంచి లాభాలు దక్కాయి. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాను చేశారు. ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి ఇది మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది. ఇప్పుడు రవితేజ-దిల్ రాజు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ 'దాగుడు మూతల దండాకోర్'.

'దాగుడు మూతల దండాకోర్' దర్శకుడిగా హసిత్ గోలి:

‘రాజ రాజ చోర’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హసిత్ గోలి. దీని తర్వాత ‘స్వాగ్’తో వచ్చి హిట్ అందుకోవడమే కాదు, ఈ మూవీతో తన రైటింగ్ స్టైల్ మిగతా వారికంటే వేరుగా ఉంటుందని నిరూపించాడు. మరీ జబర్దస్త్ కామెడీలా కాకుండా..జంధ్యాల, ఈవీవీల మాదిరిగా రాసుకున్న పాత్రల నుంచే కామెడీని తీసుకురావడం ఈ యువ దర్శకుడి సినిమాల్లో కనిపిపించింది.

ఇప్పుడు, అలాంటి దర్శకుడికి మన మాస్ రాజా రవితేజ టైమింగ్ కలిస్తే ఈ కాంబినేషన్ కొత్తగానే ఉంటుంది. ఇద్దరూ కలిసి ఏ రేంజ్‌లో రఫ్ఫాడిస్తారనేది చూడాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ నుంచి వస్తోన్న 64వ సినిమా దాగుడు మూతల దండాకోర్. ఇప్పటికే, సంక్రాంతి బరిలో భారీ చిత్రాలున్నాయి. జనవరి 8న మహాకాళి వస్తోంది. జనవరి 13న కాకా ఉంది. జనవరి 12న అదే టైటిల్ తో వస్తోన్న వెంకటేహ్-కళ్యాణ్ రామ్ ల సినిమా ఉంది. ఇక, జనవరి 14న శ్రీను వైట్ల-శర్వానంద్ ల సినిమా ఉంది.

అయినా, కూడా ఇదే, సంక్రాంతి బరిలో దిల్ రాజు-రవితేజ దిగుతున్నారంటే గ్యారెంటీగా కథ మీద గట్టిగానే నమ్మకాలున్నాయని అర్థమవుతోంది. ఇక, టైటిల్ చూస్తుంటే ఈసారి కూడా రవితేజ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతున్నాడని తెలుస్తుంది. చూడాలి, మరి మన మాస్ రాజ ఇరుముడి సక్సెస్ ట్రాక్ ని ఎంతవరకూ కంటిన్యూ చేస్తాడో. దిల్ రాజు ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తూ మళ్ళీ విజయాలవైపు అడుగులు వేస్తున్నాడు.

#raviteja#dil raju#hasith goli#dagudu muthalu dandakor
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి