క్రైమ్

TG : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

రచన: Kumar••3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రైవేట్ ట్రావెట్స్ బస్సు వెనుకనుంచి ఢీ కొట్టినట్టు తెలుస్తోంది.

ఆ సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉండగా.. ఇప్పటివరకు 6 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్టు సమాచారం. మరో 22 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. నిద్రమత్తులో ఉండగానే పలువురు ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తోంది.

తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుండగా... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రస్తుతం ప్రమాదం జరిగిన చోట సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్టు తెలిసింది.

https://x.com/pulsenewsbreak/status/2092450861289242816?s=20

ఇదిలాఉండగా, ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొన్న ఘటనపై ఆయన ఆరా తీశారు. ప్రమాద తీవ్రత, క్షతగాత్రుల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించినట్టు సమాచారం.

#Accident#six members death#injuries#suryapet#bus hit container
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి