క్రైమ్

CyberCrime: ‘బిగ్ రివీల్’పేరిట అటెన్షన్ గ్రాబ్ .. రూ.8.5 కోట్లు స్వాహా

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ ప్రకటనలు, పోలీసుల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ కొందరు అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నట్టు తెలుస్తోంది. మరికొందరు సోషల్ మీడియాను వాడే క్రమంలో వారికి తెలియకుండానే సైబర్ దాడుల బారిన పడుతున్నారు. అయితే, బిగ్ రివీల్ పేరిట ఓ కేటుగాడు రూ. 8.5 కోట్లు దోచేశాడు.

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ ప్రకటనలు, పోలీసుల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ కొందరు అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నట్టు తెలుస్తోంది. మరికొందరు సోషల్ మీడియాను వాడే క్రమంలో వారికి తెలియకుండానే సైబర్ దాడుల బారిన పడుతున్నారు. అయితే, బిగ్ రివీల్ పేరిట ఓ కేటుగాడు రూ. 8.5 కోట్లు దోచేశాడు.

బాధితుల్లో ఒకరు సోషల్ మీడియాలో అసలు విషయం పోస్టు చేయగా.. ఈ నేరం వెలుగులోచి వచ్చింది. పలువురు బాధితులు పోలీసులను సైతం ఆశ్రయించినట్టు సమాచారం. అయితే,సబ్ స్క్రిప్షన్ రూపంలో ఈ మోసం జరిగినట్టు బాధితులు వెల్లడించారు. దీంతో పోలీసులు సైతం దీనిపై విచారణ జరపుతున్నట్టు సమాచారం. సుమారు లక్షకు పైగా జనం ఈ స్కామ్‌లో ఇరుకున్నట్టు తెలిసింది.

వివరాల్లోకివెళితే.. కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘25 August 2026’ పేరిట ఓ కేటుగాడు ఖాతా తెరిచాడు.ఆగస్టు 25న ఓ పెద్ద రహస్యం బయటపెట్టబోతున్నానని.. కొన్ని రీల్స్ పోస్ట్ చేశాడు. తాను రివీల్ చేయబోయే సీక్రెట్ చూసి ఎవరూ పశ్చాత్తాపపడరని ప్రచారం చేశాడు. అదేంటో తెలియాలంటే.. తన టెలిగ్రామ్ ఛానల్‌లోకి రావాలంటూ ఆహ్వానించాడు. ఆ స్పెషల్ వీడియో చూసేందుకు.. ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేశాడు. ఇలా 1.66 లక్షల మంది రూ.500 చొప్పున చెల్లించడంతో రూ. 8.5 కోట్లు వచ్చినట్టు తెలిసింది.

తీరా ఆగస్టు 25న ఆ వీడియో రివీల్ చేయగా అందరి ఫ్యూజులు ఎగిరిపోయినట్టు తెలిసింది. అతను చెప్పినట్లు ఆ వీడియోలో ఎలాంటి ‘బిగ్ రివీల్’ లేనే లేదని, ‘సమయం ఎంతో విలువైనది’ అనే మోటివేషనల్ వీడియో మాత్రమే ప్లే అయ్యిందని సమాచారం. కాగా, ఇది ఎక్కడ జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే, టెలిగ్రామ్‌లో స్టార్స్ రూపంలో డబ్బులు ఇచ్చినందున అతడ్ని గుర్తించడం కష్టమే అని పోలీసులు చెప్పినట్టు సమాచారం. ఏదేమైనా ఈ స్కామర్ మామూలోడు కాదని నెటిజన్లు తమ అభిప్రాయం వెల్లడించారు. అదృష్టం ఏంటంటే ఒక్కొక్కరు రూ.500 మాత్రమే పొగొట్టుకున్నారని, అదే టెలిగ్రాం ద్వారా ఎంట్రీ ఇచ్చినందుకు అందరి ఫోన్లను హ్యాక్ చేసి అతని కంట్రోల్‌లోకి తీసుకుంటే ఎలా ఉండేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

#cybercrime#teligram#bigreveal#motivational video#played#fraud
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి