సినిమా

Rowdy Janardhana: మళ్ళీ రీషూట్..దిల్ రాజు ఒప్పుకుంటాడా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Rowdy Janardhana: ప్రస్తుతం దిల్ రాజు ఉన్న పరిస్థితికి రీషూట్స్ ఒప్పుకుంటాడా? ఇదే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవల కాలంలో నిర్మాతగా దిల్ రాజు లాభాలను చూడలేదంటున్నారు. అలాగే, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాల నుంచి ఆశించిన లాభాలు అందుకోలేదని చెప్పుకున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా వల్ల తీవ్రంగా నష్టాలను చూసిన దిల్ రాజు ఇంకా కోలుకోలేదు. ఇలాంటి, సమయంలో రీషూట్స్ అంటే ఎలా?

విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్ధన'..

దిల్ రాజు నిర్మాతగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా 'రౌడీ జనార్ధన' సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవి కొరణ్ కోలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శిరీష్ సహ నిర్మాత. అయితే, ఈ సినిమాలో ఉన్న కొన్ని యాక్షన్ సీన్స్ అనుకున్నంత ఇంపాక్ట్‌తో రాలేదట. దాంతో, ఆ సీన్స్ అన్నిటినీ మళ్ళీ రీషూట్ చేయాల్సిందే అని దర్శకుడు భావిస్తున్నాడట.

కానీ, ఒక్కరోజు రీషూట్ అంటేనే లక్షల్లో ఖర్చవుతుంది. అలాంటిది, యాక్షన్ సీన్స్ అంటే కనీసం వారం రోజులైనా మళ్ళీ చిత్రీకరణ జరపాల్సి ఉంటుంది. గ్యారెంటీగా ముందు అనుకున్న బడ్జెట్ కంటే అదనంగా ఇంకొన్ని కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి, నిర్మాత దిల్ రాజు ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆయనకి సినిమా అవుట్‌పుట్ ముఖ్యం. గతంలో, 'బొమ్మరిల్లు' సినిమాకి కూడా ఇలాగే క్లైమాక్స్ మళ్ళీ రీషూట్ చేశారు. దానివల్లే సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఇదే కాదు, దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన మరికొన్ని సినిమాలు కూడా ఇలా రీషూట్ జరుపుకున్నవే. దిల్ రాజు-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో, ఇప్పుడు చేస్తున్న రౌడీ జనార్ధన మూవీతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఇద్దరూ కసితో ఉన్నారు. మరి, వీరికి దర్శకుడు రవి కిరణ్ కోలా ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

#Dil Raju#Vijay Devarakonda#Rowdy Janardhana#Keerthy Suresh#Ravi Kiran Kola
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి