ప్రపంచం

US : బిగ్ బాంబ్ పేల్చిన ట్రంప్.. ఆందోళనలో విద్యార్థులు, ఉద్యోగులు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

అమెరికా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులు, అల్రెడీ అక్కడ ఉద్యోగాలు చేస్తూ సెలవుల మీద స్వదేశాలకు వీసా పని మీద వెళ్లిన వారికి ట్రంప్ సర్కార్ బిగ్‌షాక్ ఇచ్చింది. వీసా అపాయింటెమెంట్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

అమెరికా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులు, అల్రెడీ అక్కడ ఉద్యోగాలు చేస్తూ సెలవుల మీద స్వదేశాలకు వీసా పని మీద వెళ్లిన వారికి ట్రంప్ సర్కార్ బిగ్‌షాక్ ఇచ్చింది. వీసా అపాయింటెమెంట్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో చాలా మంది ఇరకాటంలో పడినట్టు సమాచారం.కొందరేమో చదువుల కోసం, మరికొందరు ఉద్యోగాలు, మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.తాజాగా ట్రంప్ సర్కార్ నిర్ణయంతో వీరింతా అయోమయంలో పడ్డారు. ఉద్యోగులు అయితే తమ జాబ్స్ ఎక్కడ పోతాయో అని భయాందోళనలో ఉన్నట్టు సమాచారం.

కేవలం ఒక్క భారతీయులకు మాత్రమే కాదు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ అమెరికా వీసా అపాయింట్మెంట్లు తాత్కాలికంగా నిలివేస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బుక్ అయిన వీసా ఇంటర్వ్యూలను సైతం రీషెడ్యూల్ చేస్తోంది.అయితే, కాన్సులేట్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు, వీసా దరఖాస్తుదారులను మరింత కఠినంగా పరిశీలించి అనుమతి ఇవ్వడం, రిజెక్షన్ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. వరల్డ్‌లోని అన్ని యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్‌లలోని సిబ్బంది కోసం ప్రత్యేక గ్లోబల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఈ శిక్షణకు అనుగుణంగా వీసా సర్వీస్ అపాయింట్‌మెంట్లలో మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకున్న వీసా దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్లు క్యాన్సిల్ చేసినట్టు ఈ మెయిల్స్ పంపినట్టు సమాచారం. కొత్త అపాయింట్మెంట్ల తేదీలు, సమయాన్ని తర్వాత తెలియజేస్తామని ఈ మెయిల్‌లో వెల్లడించినట్టు సమాచారం. అయితే, యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్‌లలో సిబ్బందికి అందించనున్న శిక్షణ గురించి, అది ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై అమెరికా విదేశాంగ శాఖ క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలాఉండగా, అక్రమంగా, తప్పుడు ధ్రువపత్రాలతో వలసదారులు అమెరికాలోకి వస్తున్నట్టు ఆరోపిస్తున్న ట్రంప్.. మరోసారి వారి మీద ఉక్కుపాదం మోపేందుకు వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు తెలుస్తోంది. మైగ్రేషన్స్ వలన అమెరికా పౌరులకు అన్యాయం జరుగుతోందని, అందుకే వలసదారులను దేశంలోకి రాకుండా నిరోధించేందుకే ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

#America#visa#interviews#cancelled#traning#trump#students
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి