బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘నా మీద పగ ఉంటే చంపేయండి’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.కూకట్ పల్లి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకటి హైదరాబాద్‌లో.. మరొకటి మల్కాజ్‌గిరిలో.. ఇంకొకటి సైదాబాద్‌లో కలిపారని ఫైర్ అయ్యారు.తన మీద కోపంతో నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయొద్దని వ్యాఖ్యానించారు. 22 ఏ నిషేధిత జాబితా నుంచి కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజల భూములు, ఆస్తులను తొలగించకపోతే నిన్ను వదిలిపెట్టను రేవంత్ రెడ్డి అంటూ వార్నింగ్ ఇచ్చారు.
తను ఎమ్మెల్యే అని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గుర్తించడం లేదని, తన నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. పోలీసులు కూడా తన మాటను లెక్కచేయడం లేదని వాపోయారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో 22ఏ కు వ్యతిరేకంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.తన నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో తనను గెలిపించారని గుర్తుచేశారు.
అలాంటిది నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేయడంతో పాటు 22ఏ పేరిట ఇక్కడి ప్రజలను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. వెంటనే ఆ జాబితా నుంచి నియోజకవర్గ ప్రజల ఆస్తులు,భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. తనతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే తన నియోజకవర్గ ప్రజల కోసం ఉరిపెట్టుకుని చావడానికైనా సిద్ధమని కూకట్ పల్లి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా, గత కొంతకాలంగా మాధవరం కృష్ణారెడ్డి ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
https://x.com/pulsenewsbreak/status/2092489174419140772?s=20


