National

karnataka: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని మహర్షి వాల్మీకి అభివృద్ధి సంస్థలో రూ.89 కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేశాయి.

కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని మహర్షి వాల్మీకి అభివృద్ధి సంస్థలో రూ.89 కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేశాయి. సంస్థ అధికారి చంద్రశేఖరన్ మృతితో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం, మంత్రి బి.నాగేంద్ర రాజీనామాకు దారితీసింది.. ఈ ఆరోపణలతో గతంలో పదవికి దూరమైన నాగేంద్ర పై విచారణ కొనసాగుతున్న క్రమంలో తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.

బీజేపీ, జేడీఎస్ కూటమి ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే నేపథ్యంలో రాయచూరు నుంచి నాగేంద్ర సొంత స్థానమైన బళ్లారి వరకు 200 కిలోమీటర్ల పాదయాత్రకు బీజేపీ పిలుపునిచ్చింది. ఇక ఈ వివాదం కేవలం విపక్షాల విమర్శలకే పరిమితం కాలేదు. కాంగ్రెస్ పార్టీలోని ఆంతరంగిక సమీకరణాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని సీనియర్ నేతలు నాగేంద్రను మంత్రివర్గంలోకి తీసుకోవడం పై బహిరంగంగానే ప్రశ్నించారు.

మరోవైపు తనవళ్ళ పార్టీకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన నాగేంద్ర, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఫోన్‌లో సంప్రదింపులు జరిపి, పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లకుండా రాజీనామాకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు తాను దళిత నేతనైనందుకే విపక్షాలు తనను లక్ష్యంగా చేసుకుంటున్నాయని నాగేంద్ర ఆరోపిస్తున్నారు.

తనపై వచ్చిన ఆరోపణలు చట్టపరంగా రుజువు కాలేదని, కేవలం నిందితుడిగా మాత్రమే పేర్కొన్నారని.. అంతమాత్రానే విపక్షాలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగడం హేయమైన చర్యగా ఆయన వాదిస్తున్నారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపితే నాగేంద్ర రాజీనామా అధికారికం కానుంది. ఒకవైపు ప్రతిపక్షాల సుదీర్ఘ పాదయాత్ర, మరోవైపు స్వపక్షంలోనే పెరుగుతున్న అసంతృప్తిని తట్టుకుని ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచడం ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి సవాలుగా మారింది..

#karnataka#politics#bjp forces#congress#minister-nagendra#resign
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి