National

Bihar : బీజేపీ సర్కారుపై విమర్శలు.. ఆరేళ్ల బాలుడి అరెస్టు (వీడియో వైరల్)

రచన: Kumar••4 నిమిషాల పఠనం

బిహార్‌ రాష్ట్రంలో విద్యావ్యవస్థలోని సమస్యలు, ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు నిర్వహిస్తున్న ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు.

బిహార్‌ రాష్ట్రంలో విద్యావ్యవస్థలోని సమస్యలు, ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు నిర్వహిస్తున్న ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు.దీంతో అక్కడ తోపులాట జరిగినట్టు సమాచారం. ఆ తర్వాత సిచువేషన్‌ను పోలీసులు కంట్రోల్ చేశారు.పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే 70వ BPSC పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో ఓ ఆరేళ్ల బాలుడు పాల్గొన్నాడు.ఈ సందర్భంగా తమ స్కూల్‌లో కనీస వసతులు లేవని, టీచర్లు కూడా సరిగ్గా రావడం లేదని విషయాల్ని బాలుడు మీడియా ముఖంగా లేవనెత్తాడు.అలాగే, నేరస్తుల్ని పట్టుకోలేరు కానీ, విద్యాహక్కు కోసం పోరాడుతున్న విద్యార్థులపై చెయ్యి చేసుకుంటారా? అని నిలదీశాడు.

ఆ బాలుడిని సామ్రాట్ చౌదరిగా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడంతో భారీ బందోబస్తు మధ్య ఆ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. అతన్ని పోలీసులు రోడ్డు మీద తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాలుడిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం,పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు.

https://x.com/pulsenewsbreak/status/2092486536923435064?s=20

కాగా, ప్రభుత్వ నిర్లక్ష్యం,విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపినందుకు ఆరేళ్ల బాలుడిని అరెస్టు చేస్తారా? అంటూ బిహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్‌జేడీ, దేశంలోని ఇండియా కూటమి మిత్రపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆరేళ్ల ఏళ్ల బాలుడిని అడిగిన ప్రశ్నలకు డబుల్ ఇంజిన్ సర్కార్ భయపడిందని,అందుకే భారీ బందోబస్తు నడుమ అతన్ని అరెస్టు చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ చెప్పిన రామరాజ్యం ఇదేనా? నేరస్థుల్ని పట్టుకోవడానికి చేత కాదు కానీ, బాలుడ్ని పట్టుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో న్యాయం కావాలని నిరసనలు చేస్తే దాడులు చేయడం, అరెస్టు చేయడం కామన్ అయిపోయిందని నెట్టింట పెద్దఎత్తున చర్చ,విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

https://x.com/TeluguScribe/status/2092499275137876266?s=20

#bihar#6 years old boy#arrested#police#education system failed#students protests
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి