రాజకీయాలు

BRS : రేవంత్ రెడ్డి భూ కబ్జాదారుడు : హరీశ్ రావు

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో 22 ఏ నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ, ప్రయివేటు భూములను చేర్చడం ద్వారా పట్టాదారులు, అసలైన ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది తమ బిడ్డల పెళ్లిళ్లు, ఉన్నత చదువుల కోసం భూములు, భవనాలు అమ్ముకుందామని ప్రయత్నిస్తే 22ఏ నిషేధిత జాబితాలో తమ ప్రాపర్టీలు ఉన్నాయని, వాటిని అమ్మడానికి లేదని రిజిస్ట్రార్ అధికారులు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో 22 ఏ నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ, ప్రయివేటు భూములను చేర్చడం ద్వారా పట్టాదారులు, అసలైన ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది తమ బిడ్డల పెళ్లిళ్లు, ఉన్నత చదువుల కోసం భూములు, భవనాలు అమ్ముకుందామని ప్రయత్నిస్తే 22ఏ నిషేధిత జాబితాలో తమ ప్రాపర్టీలు ఉన్నాయని, వాటిని అమ్మడానికి లేదని రిజిస్ట్రార్ అధికారులు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం పట్టా ల్యాండ్స్‌గా ఉన్న తమ భూములను ఎలా నిషేధిత జాబితాలో పెడతారని ప్రజలు రివర్స్ అవుతున్నారు.

అయితే,గత కొన్నిరోజులుగా 22 ఏ నిషేధిత జాబితాలో తమ ఆస్తులు చేరడం వలన ఇబ్బందులు పడుతున్న బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాడ్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ కబ్జాదారుడు అని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ, అసైన్డ్ భూములను లాక్కుంటూ, ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన రేవంత్ అసలైన కబ్జాదారుడు అని విమర్శించారు.

22-Aను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కబ్జాదారులు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజలు కబ్జాదారులా? అని నిలదీశారు. ప్రజలు కాదు రాత్రికి రాత్రి భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారిందని ఫైర్ అయ్యారు. కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టి కట్టుకున్న ఇళ్ళల్లో 40, 50 ఏళ్ల నుండి జీవిస్తున్న ఈ ప్రజలు కబ్జాదారులా? అని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు.

2008లో దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి యూఎల్సీ భూములను రద్దు చేశాడని ఈ సందర్భంగా గుర్తుచేశారు.కానీ, రేవంత్ రెడ్డి ఇవాళ మీ భూములు 2008 కంటే ముందు ULC(అర్బన్ ల్యాండ్ సీలింగ్)లో ఉన్నాయని నిషేధిత జాబితాలో పెట్టాడని మండిపడ్డారు.

ఇది సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుందని, రేవంత్ రెడ్డి బాధితులను పట్టుకొని కబ్జాదారులు అంటున్నాడని ఫైర్ అయ్యారు. 22 ఏ తప్పిదానికి గాను బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

https://x.com/TeluguScribe/status/2092498199173046275?s=20

#revanth reddy#harish rao#22a dispute#minister ponguleti srinivasa reddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి