సినిమా

Dil Raju: దిల్ రాజుకి టాక్సిక్ ఎఫెక్ట్..ఈసారి దెబ్బ ఇంకా గట్టిగా తగిలింది.

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Dil Raju: దిల్ రాజుకి టాక్సిక్ ఎఫెక్ట్..ఈసారి దెబ్బ ఇంకా గట్టిగా తగిలింది. అవును..ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేసింది దిల్ రాజు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి డివైడ్ టాక్ కూడా కాదు, ఏకంగా ఫ్లాప్ టాక్ వచ్చింది. కనీసం మధ్యాహ్నం షో కూడా పడకముందే ఇలాంటి టాక్ రావడంతో అందరూ పాపం దిల్ రాజు అంటూ సానుభూతి చూపిస్తున్నారు. టాక్సిక్ డిస్ట్రిబ్యూషన్‌తో ఎన్ని కోట్ల లాస్ మోయనున్నాడో దిల్ రాజు అంటున్నారు.

ఇదే సమయంలో ఇరుముడి టీమ్ కి చరణ్ విషెస్:

ఒకవైపు యష్ నటించిన టాక్సిక్ రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. గీతూ మోహన్ దాస్ డెబ్యూ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. సినిమాకి ప్రమోషన్స్‌తో వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన టాక్సిక్ గ్రాండ్ ఈవెంట్‌లో దిల్ రాజు మాటలు కూడా అందరూ గుర్తు పెట్టుకున్నారు. ఇంతకముందు పెద్ది రిలీజ్ సమయంలో డిస్ట్రిబ్యూషన్ పరంగా దిల్ రాజు సోదరుడు చేసిన వ్యవహారం అందరికీ తెలిసిందే.

అవన్నీ, ఇప్పుడు దిల్ రాజుకి టాక్సిక్ రూపంలో సమాధానం చెప్పినట్టైంది. గత కొంతకాలంగా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా నష్టాలను చూస్తున్నాడు దిల్ రాజు. మైత్రీ వారిపై కోపంతో కొన్ని వ్యవహారాలు చేసి ఇండస్ట్రీలోనూ బ్యాడ్ అయ్యాడనే మాట వినిపిస్తోంది. ఇలాంటి, సమయంలో టాక్సిక్ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకొని పెద్ద సాహసం చేశాడు. సినిమాపై ఉన్న క్రేజ్, హైప్ చూసి మళ్ళీ కాలరెగరేస్తాడు దిల్ రాజు అనుకున్నారు. కట్ చేస్తే సినిమా డిజాస్టర్. ఇదే ఒక దెబ్బ అనుకుంటే..

ఇరుముడి సినిమా చిత్రబృందానికి మన మెగా పవర్ స్టార్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఘన విజయం సాధించిన రవితేజకు అలాగే, చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణను చూడటం ఎంతో ఆనందంగా ఉంది. చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌కు మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను.. స్వామి శరణం..అంటూ చరణ్ ట్వీట్ చేశాడు. దీంతో, దిల్ రాజు కి చరణ్ పోస్ట్ మరో దెబ్బ అని నెటిజన్స్, అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

#dil raju#toxic#yash#geethu mohan das
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి