వైరల్ న్యూస్

Delhi : కారు రూఫ్ మీదకు ఎక్కి ‘టెకీ’ వర్క్.. వీడియో వైరల్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

దేశంలో యువతను ఉద్యోగ భయం వెంటాడుతోంది.జాబ్స్ రానివారికి రాలేదనే బాధ వెంటాడుతుంటే..ఉన్నవారికి ఎప్పుడు ఊడుతుందో అనే టెన్షన్ వారిని కలవరపెడుతోంది. గత ఏడాది వ్యవధిలోనే వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి.

దేశంలో యువతను ఉద్యోగ భయం వెంటాడుతోంది.జాబ్స్ రానివారికి రాలేదనే బాధ వెంటాడుతుంటే..ఉన్నవారికి ఎప్పుడు ఊడుతుందో అనే టెన్షన్ వారిని కలవరపెడుతోంది. గత ఏడాది వ్యవధిలోనే వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు కాస్ట్ కట్టింగ్ పేరిట ఉద్యోగులను తొలగిస్తే మరికొన్ని కంపెనీలు మాత్రం ఏఐ(ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్) స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకోలేదని మరికొందరినీ తీసేశాయి..

ఇందులో పలానా కంపెనీ అని పేరు పెట్టడానికి లేదు. మల్టీనేషనల్ కంపెనీలు సైతం ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఏండ్లుగా నమ్మకంతో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం పింక్ స్లిప్స్ ఇచ్చాయి.ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కొత్త నియామకాలు సైతం ఆగిపోయాయి. దీంతో ఐటీ జాబ్స్ చేస్తున్న వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ జాబ్ ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు ఊడుతుందా? అని తెలియక నాన్ స్టాప్ డ్యూటీలు చేస్తున్నట్టు సమాచారం.

ఏ టైంలో మీటింగ్స్ పెట్టినా , వీకెండ్స్‌లోనూ అందుబాటులో ఉండాల్సిన అవసరం నెలకొందని వాపోతున్నారు. లేదంటే సింపుల్‌గా మెయిల్ పెట్టి తొలగిస్తున్నారని వాపోతున్నారు. ఇలాగే ఓ మహిళా ఎంప్లాయీ తనను అకారణంగా జాబ్ నుంచి తొలగించారని గత కొన్నిరోజులుగా హైదరాబాద్ లోని టెక్ మహింద్రా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.

https://x.com/pulsenewsbreak/status/2092496409413198037?s=20

ఇదిలాఉండగా ఓ ఉద్యోగి తన జాబ్ కాపాడుకునేందుకు, ఆఫీస్ టైం అయ్యిందని ఏకంగా కారు రూఫ్ మీదకు ఎక్కి వర్క్ చేయడం అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. దేశరాజధాని ఢిల్లీ పరిధిలోని గుర్గావ్‌లో ఓ ఐటీ ఎంప్లాయీ కారుపై కూర్చొని ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ కనిపించాడు.

భారీ వర్షాల కారణంగా గుర్గావ్‌లో రోడ్లన్ని జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మరో దారి లేక తన కారుపైనే కూర్చొని ల్యాప్‌టాప్‌లో ఓ ఉద్యోగి పని చేస్తూ కనిపించాడు. అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కాగా, అతనికి Employee Of The Year అవార్డ్ ఇవ్వాలంటూ పలువురు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. కష్టకాలంలో ఆఫీసుకు ఆలస్యంగా వెళితే జాబ్ పోతుందనే భయంతో అతను అలా చేయాల్సి వచ్చిందని పలువురు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

#IT employee#car roof#sitting#job#delhi#gurugram#videoviral
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి