Irumudi: రవితేజ నటించిన ఇరుముడి సినిమా కొత్త రికార్డులనే కాదు, కొత్త చరిత్రను సృష్ఠించింది. ఈ సినిమా షోలను తీసేసినందుకు తెలంగాణలో ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు సినిమా థియేటర్ ముందు ధర్నాకి దిగారు. మళ్ళీ ఇరుముడి సినిమా షోలను ప్రదరించాలంటూ ఆందోళ చేశారు. ఒక సినిమా గురించి ఈ రకంగా ధర్నా తెలుగు సినిమా చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.
మాస్ మహారాజ్ రవితేజ, శివ నిర్వాణ కలయికలో వచ్చిన కమర్షియల్ అండ్ సెంటిమెంట్ మూవీ ఇరుముడి. తండ్రీకూతురు మధ్య సాగే కథకి అయ్యప్ప దీక్ష, భక్తిని జోడించి రూపొందించాడు. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా భారీ చిత్రాలను అందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. ముందు నుంచి సినిమాపై దర్శకుడు శివ నిర్వాణ అంచనాలను పెంచుతూ వచ్చాడు.
అయితే, మొదటి ఆట నుంచే ఈ రేంజ్‌లో పాజిటివ్ టాక్ వస్తుందని, ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు. కేవలం రోజున్నరలోనే బ్రేకీవెన్ అవడం ఇప్పటి వరకూ ఏ సినిమాకి జరగలేదు. ఒకప్పుడు సంచలనం సృష్ఠించిన పోకిరి, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాల రికార్డులను కూడా తిరగరాసింది. దాదాపు 120 కోట్ల వసూళ్ళు రాబట్టింది ఇరుముడి.
అయితే, ఆగస్టు 26న కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల హౌజ్ ఫుల్ తో రన్ అవుతున్న ఇరుముడి మూవీని టాక్సిక్ కోసం తొలగించారు. ఈ సంఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా.. మక్తల్‌లో చోటు చేసుకుంది. ఈ ఊరిలో ఉన్న వెంకటరమణ థియేటర్ నుంచి ఈ బుధవారం నాడు టాక్సిక్ సినిమాను హఠాత్తుగా తొలగించడంతో ప్రేక్షకులు ధర్నా చేశారు. దీనిపై, థియేటర్ యాజమాన్యం ఎలా స్పందిస్తారో.


