సినిమా

Rukmini Vasanth: టాక్సిక్‌లో వల్గర్ రోల్..ఒప్పుకోవాల్సింది కాదు!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Rukmini Vasanth: రుక్మిణి వసంత్..తాజాగా ఈ బ్యూటీ ఓ కీలక పాత్రను పోషించిన టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో రిలీజైంది. కన్నడ రాకింగ్ స్టార్.. యష్ కేఫీఎఫ్ సిరీస్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాల తర్వాత చేసిన ప్రాజెక్ట్ కావడంతో భారీ అంచనాలుండటం సహజం. అందులోనూ, ట్రైలర్ సహా ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ హైప్ ఈ మూవీపై నెలకొంది. మొదటి రోజు కలెక్షన్స్ 100 కోట్ల వరకూ అంచనా వేస్తున్నారు.

లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా, కీయారా అద్వానీ హీరోయిన్‌గా వచ్చిన టాక్సిక్ మూవీపై భారీగా నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇది, జన్యూన్ మౌత్ టాక్ కావడం ఆశ్చర్యకరం. అసలు, ఈ సినిమాను ఎందుకు తీశారో, ఎవరికోసం తీశారో అర్థం కావడం లేదని నెటిజన్స్ సోషల్ మీడియా వేధికగా ఘాటైన కామెంట్స్ పెడుతున్నారు. మన సౌత్‌లో పాన్ ఇండియా హీరోలంటే తెలుగులో ప్రభాస్, కన్నడలో యష్.

అయితే, కేజీఎఫ్ 1 అండ్ 2 తర్వాత అంతకు మించి పాన్ ఇండియా సినిమా చేయాలనుకున్న మేకర్స్, పూర్తిగా యష్ కెరీర్ డ్యామేజ్ అయ్యేటువంటి కథతో వచ్చారు. అసలు కథ-కథనాలను యష్ ఎలా ఒప్పుకున్నాడు..నిర్మాత ఇన్ని వందల కోట్లు ఎలా ఖర్చు చేశారూ? అని వాపోతున్నారు. కియారా పాత్ర ఘాటుగా ఉంటుందని ట్రైలర్, సాంగ్‌తో అర్థమైంది. కానీ, అంతకంటే వల్గర్‌గా ఇతర హీరోయిన్స్ పాత్రలు ఉన్నాయి.

కాంతార 1 కి టాక్సిక్ లో రుక్మిణి కి పొంతన లేదే?

కాంతార ఛాప్టర్ 1లో ఎంతో హుందాతనమైన పాత్రలో నటించి ఒక్కసారిగా సౌత్ మొత్తం క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణి..ఎన్‌టిర్ తో డ్రాగన్ అనే మరో పాన్ ఇండియా సినిమా చేస్తోంది. ఇలాంటి, సమయంలో టాక్సిక్ సినిమా ఒప్పుకోవడం బిగ్ మిస్టేక్. ఆమె పాత్ర వల్గారిటీగా డిజైన్ చేశారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. పైగా కెరీర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇంటిమేట్ సీన్ చేయాలంటే ఇంత చిన్న పాత్ర ఒప్పుకోవాలా? రుక్మిణి కథ వినే టాక్సిక్ ఒప్పుకుందా? రెమ్యునరేషన్ భారీగా ఇస్తామన్నారా? యష్‌తో సినిమా చేస్తే గుర్తింపు వస్తుందని కమిటైందా? ఇలాంటి ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా రుక్మిణి వసంత్ మాత్రం టాక్సిక్ చేసి తప్పటడుగు వేసింది.

#rukmini vasanth#yash#toxic#geethu mohandas#kiara advani
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి