తెలంగాణ

Telangana: పోలవరానికి పోటెత్తిన గోదావరి.. 48 గేట్లు ఎత్తివేత!

రచన: Venu••4 నిమిషాల పఠనం

నదీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, గోదావరి వరద ప్రభావం దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ గండిపోశమ్మ ఆలయంపైనా పడింది. ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో క్యూ లైన్లు, ఆలయ పరిసరాల్లోని దుకాణాలు పూర్తిగా నీట మునిగాయి.

రోజురోజుకూ గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. తెలంగాణతో పాటు గోదావరి ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్నవర్షాలతో భారీగా వరద నీరు దిగువకు చేరుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ప్రవాహం తీవ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 30.30 మీటర్లకు చేరుకోగా, స్పిల్‌వే వద్ద 30.20 మీటర్లుగా నమోదైంది.

వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు స్పిల్‌వేకు చెందిన మొత్తం 48 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం సుమారు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక వరద ఉద్ధృతి నేపథ్యంలో పోలవరం పరిసర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, గోదావరి వరద ప్రభావం దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ గండిపోశమ్మ ఆలయంపైనా పడింది. ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో క్యూ లైన్లు, ఆలయ పరిసరాల్లోని దుకాణాలు పూర్తిగా నీట మునిగాయి. పి.గొందూరు నుంచి నాగులపల్లి గ్రామాల మధ్య రహదారిపైకి వరద నీరు చేరడంతో గండిపోశమ్మ ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి.

మరోవైపు గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఈ ప్రభావం పాపికొండల విహారయాత్రపై పడింది. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు బోట్ల రాకపోకలను నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో పోలవరం వద్ద పరిస్థితి ఉత్కంఠగా మారింది. వరద మరింత పెరిగితే దిగువ ప్రాంతాలపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..

#Telangana#godavari#water flood#polavaram#48-gates-lifted#rain
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి