Toxic Twitter Review: కొత్తగా రిలీజైన సినిమా మీద సోషల్ మీడియా ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఏ సినిమాకైనా ట్విట్టర్‌లో పాజిటివ్ రివ్యూస్ వస్తే అదే ఊపు కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నెగిటివ్‌గా గనక రివ్యూలు, కామెంట్స్ వస్తే ఇక.. ఆ సినిమా ఫ్లాప్ కాబోతుందని హింట్ అనుకోవచ్చు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సిక్ సినిమా పరిస్థితి చూస్తుంటే ఇలాగే ఉంది.
ట్విట్టర్‌లో నెగిటివ్ టాక్..
యష్, గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్‌లో వచ్చిన టాక్సిక్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నుంచి వచ్చిన ఒక్కో అప్‌డేట్ అటు కన్నడలో ఇటు తెలుగులో మిగతా భాషలలోనూ భారీ హైప్ ని పెంచేసింది. ఇక, బెంగుళూరు-హైదరాబాద్‌లలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్స్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. దాంతో, ప్రత్యేకించి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ టికెట్ రేట్లను పెంచుకునేలా జీవోను పాస్ చేశారు. కానీ, ఇప్పుడు సినిమా ఫ్లాప్ అనే మాట వినిపిస్తోంది.
నెటిజన్ 1: టాక్సిక్ మూవీ ఫస్ట్ హాఫ్, యశ్ ఎంట్రీ సీన్, యాక్షన్ ఎపిసోడ్స్ బావున్నాయి. సినిమాటోగ్రఫీ, సెట్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. హీరోయిన్స్ కియారా అద్వానీ, నయనతార పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. కానీ, ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువగా ల్యాగ్ ఉంది. ఒక అడల్ట్ సీన్, తర్వాత ఫైట్ సీన్..ఇలా రొటీన్‌గా సాగుతుంది. ఎమోషనల్ గా మాత్రం ఎక్కడా కనెక్ట్ కాలేదు అని రాసుకొచ్చాడు.
నెటిజన్ 2: హీరో యశ్ ఎంట్రీ, యాక్షన్ సీక్వెన్సెస్, గ్రాండ్ విజువల్స్ బాగానే ఉన్నాయి. హీరోయిన్ కియారా అద్వానీ తన పాత్రతో మెప్పించింది. అయితే, కోర్ ఎమోషన్ ఏమాత్రం ఆలు వర్కవుటవలేదు. మరీ స్లో నేరేషన్, ఆఖర్రి 40 నిమిషాలు చాలా సిల్లీగా అనిపించాయి. ఎన్నో అంచనాలతో వెళితే తీవ్ర నిరాశకు గురయ్యాము. రన్‌టైమ్ కూడా ఎక్కువవడంతో చాలా బోరింగ్ అనిపించింది. వెరీ డిజప్పాయింటింగ్ అంటూ ఒకతను ట్వీట్ చేశాడు. ఇలాంటి, ట్వీట్స్ చాలానే ఉన్నాయి. మరి, ఈ సినిమాకి అసలు టాక్ ఎలా ఉంటుందో చూడాలి.


