సినిమా

Prabhas-Fauzi: రిలీజ్‌కి 100 రోజులు..ఓవర్సీస్‌లో బిజినెస్ క్లోజ్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Prabhas-Fauzi: కొందరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపవుతున్నా కూడా భారీ ఓపెనింగ్స్ రాబడుతుంటాయి. అంతేకాదు, రిలీజ్‌కి ఇంకా మూడు, నాలుగు నెలల సమయం ఉన్నా కూడా ముందే ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్ డీల్ క్లోజ్ అయిపోతుంటాయి. ఆ లెక్కలన్నీ కేవలం మన హీరోలను చూసే వేస్తుంటారు. అలాంటి, హీరోల్లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ ఫౌజీ. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 2న ప్రీమియర్స్ పడబోతున్నాయి. అయితే, ఇంకా రిలీజ్ కి 100 రోజుల సమయం ఉన్నా కూడా ఓవర్సీస్‌లో ఫౌజీ చిత్రాన్ని ఫార్స్ ఫిల్మ్ భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతుంది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్స్‌ను వదిలారు.

అంతేకాదు.."ధైర్యవంతుడైన సైనికుడి కథను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నాం" అంటూ పోస్టర్‌లో పవర్ఫుల్ లైన్ ను హైలెట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇన్స్టా ఫేమ్ ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఫౌజీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ప్రభాస్ నటిస్తున్న సన్నివేశాలను ఆగస్టు నెల ప్రారంభం నుంచి హైదరాబాద్‌లో పూర్తి చేస్తున్నారు. కోకాపేట్ లో వేసిన భారీ చార్మినార్ సెట్ సినిమాకి హైలెట్‌గా నిలవనుంది. ఇక, బిజినెస్ పరంగా ప్రభాస్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు ఓవర్సీస్ మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ఇప్పటికే చూశాము. ‘బాహుబలి’ సిరీస్‌తో డార్లింగ్ సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా నార్త్ అమెరికా, గల్ఫ్ సహా ఇతర దేశాల్లో కూడా బాగా మార్కెట్ పెరిగింది. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ లాంటి భారీ సినిమాల తర్వాత ఇప్పుడు రాబోతున్న ‘ఫౌజీ’ మాత్రం వేరే జానర్‌తో తెరకెక్కుతోంది. బ్రిటిష్ కాలం నేపథ్యంలో ఒక సైనికుడి కథను హను రాఘవపూడి చూపించబోతున్నాడు.

#prabhas#fauzi#hanu raghavapudi#imanvi#mythri movie makers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి