Salman Khan: బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముంబై నుంచి హైదరాబాద్‌కి కొంతకాలం మకాం మార్చబోతున్నాడా? ప్రస్తుతం అటు ముంబై మీడియాలో ఇటు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట వినిపిస్తోంది. అంతేకాదు, అక్కడా--ఇక్కడా మీడియాలోనూ ఇదే వార్త వైరల్ అవుతోంది. దీనికి, కారణం గతంలో ఆయన చేసిన పెద్ద పొరపాటు వల్లే అని తెలుస్తోంది.
సల్మాన్‌కి ప్రాణహాని?
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్‌ది ఓ డిఫరెంట్ జర్నీ. ఇంకా పెళ్ళి కానీ బ్రహ్మచారి. జంతువులను వేటాడిన కేసులో జైలుకెళ్ళిన పరిణామాలు..హీరోయిన్స్‌తో విభేదాలు..ఇలా చాలా సమస్యలను ఎదుర్కున్నాడు. దీని వల్ల కొంతకాలం విపరీతమైన మానసిక ఒత్తిడిని అనుభవించాడు. ఇప్పుడు, కూడా అలాంటి మానసిక ఒత్తిడితోనే ఉన్నాడు. అందుకే, ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్ కేంద్రంగా ప్లాన్ చేసుకుంటున్నాడట.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎప్పటికప్పుడు సల్మాన్ కి ప్రాణ హాని ఉన్నట్టుగా హెచ్చరికలు వస్తున్నాయి. ప్రస్తుతం, ఆయన ముంబైలో పోలీసు బందోబస్తు నడుమ ఉంటున్నాడు. ఫుల్ టైట్ సెక్యూరిటీ మధ్య ఆయన సినిమాల షూటింగ్ కూడా జరుగుతోంది. దీంతో, ముంబై వీడి హైదరాబాద్ వస్తే కాస్త అన్నిటికీ ఉపశమనం లభిస్తుందని సల్మాన్ ఖాన్ భావించి కొంతకాలం ఇక్కడికి మకాం మార్చాలని నిర్ణయించుకున్నాడట.
టాలీవుడ్ ప్రముఖుల సపోర్ట్:
సల్మాన్ ఖాన్‌కి మన తెలుగులో మెగా ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉంటుంది. చిరు-చరణ్‌లతో మంచి బాండింగ్ ఉంది. వెంకటేష్-నాగార్జునలతోనూ మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అలాగే, ప్రస్తుతం సల్మాన్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. హీరోయిన్‌గా నయన్‌తార నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగున్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడున్న కండీషన్స్ వల్ల సల్మాన్ వృత్తిపై పూర్తిగా దృష్టి పెట్టలేక, మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నాడట. వీటన్నిటి నుంచి ప్రశాంతమైన వాతావరణం కోసం హైదరాబాద్‌లో ఉండేందుకు ప్లాన్ చేస్తుకున్నట్టుగా తెలుస్తోంది.


