సినిమా

Mahesh Babu: వారణాసి తర్వాత సేఫ్ గేమ్ ప్లాన్ చేస్తున్న సూపర్ స్టార్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Mahesh Babu: వారణాసి..సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గ్లోబల్ మూవీ. నిన్నా మొన్నటి వరకూ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ అని, పాన్ వరల్డ్ మూవీ అని చెప్పుకున్నారు. కానీ, ఈ సినిమా 120 దేశాలలో 50 భాషలలో రిలీజ్ కాబోతుందని రాజమౌళి అధికారికంగా వెల్లడించారు. దాంతో, వారణాసి గ్లోబల్ మూవీగా రాబోతుంది. ఇక, ఈ సినిమా బడ్జెట్ 1300 నుంచి 1400 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు. మన ఇండియాలోనే హైయ్యెస్ట్ బడ్జెట్ సినిమా.

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. గ్లోబల్ వైడ్‌గా ప్లాన్ చేశారు కాబట్టే, ఆ రేంజ్ లో క్రేజ్ అండ్ మార్కెట్ ఉన్న ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకున్నాడు రాజమౌళి. ఇక, ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సెప్టెంబర్ నుంచి రీరికార్డింగ్ స్టార్ట్ చేసి 2027, జనవరి వరకూ పూర్తి చేయనున్నాడు.

అయితే, 1000 కోట్లకి పైగా బడ్జెట్ ఉన్న సినిమాను చేస్తున్న మహేష్ బాబు.. నెక్స్ట్ సినిమాను ఏ రేంజ్ లో ఒప్పుకుంటాడు అనేది ఇప్పుడు, ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మన హీరోలందరు ఒక్కసారి పాన్ ఇండియా సినిమాను చేశాక రీజనల్ మూవీ..100-150 కోట్ల బడ్జెట్ సినిమాను చేయడం లేదు. వారణాసి మూవీతో మహేష్ ఫస్ట్ గ్లోబల్ మూవీని చేస్తున్నాడు.

కాబట్టి, నెక్స్ట్ సినిమా అదే రేంజ్ లో చేస్తాడా అనేది హాట్ టాపిక్ ఇప్పుడు. అయితే, మహేష్ బాబు నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీరి కాంబినేషన్‌లో ఇంతకముందు సరిలేరు నీకెవ్వరూ సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి సేఫ్ ప్రాజెక్ట్ చేస్తాడు. 150 కోట్లకి మించి ఖర్చు చేయడు. మరి, మహేష్ ఇందుకు ఒప్పుకుంటాడా అనేది చూడాలి.

#maheshbabu#ss.rajamouli#varanasi#anilravipudi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి