సినిమా

AP: ఇరుముడి మూవీ టీమ్ కు షాకిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

ఉపాధ్యాయ వృత్తిని, ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను కించపరిచేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఏపీటీఎఫ్ ఆరోపించింది. ముఖ్యంగా ఓ మహిళా టీచర్ పాత్రను ప్రతికూలంగా, అనైతిక ప్రవర్తన కలిగిన వ్యక్తిగా చూపించడం పై అభ్యంతరకరం వ్యక్తం చేసింది.

మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ టీం హ్యపీ మూడ్ లో ఉన్న సమయంలో ఈ చిత్రం పై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఉపాధ్యాయ వృత్తిని, ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను కించపరిచేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఏపీటీఎఫ్ ఆరోపించింది. ముఖ్యంగా ఓ మహిళా టీచర్ పాత్రను ప్రతికూలంగా, అనైతిక ప్రవర్తన కలిగిన వ్యక్తిగా చూపించడం పై అభ్యంతరకరం వ్యక్తం చేసింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరును నేరుగా సినిమాలో ఉపయోగించడంతో పాటు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ధరించే యూనిఫామ్‌ను కూడా చిత్రీకరణలో వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నిజమైన పాఠశాల పేరు, విద్యార్థుల గుర్తింపుతో కూడిన అంశాలను కథలో భాగం చేయడం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ పేర్కొంది. ఈ క్రమంలో చిత్రబృందం వివాదాస్పద సన్నివేశాలను వెంటనే తొలగించాలని.. ఉపాధ్యాయ సంఘానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఒకవేళ తమ డిమాండ్ల పై స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది.

మరోవైపు ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ఈ వివాదంపై స్పందించారు. తాను గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశానని.. సమాజంలో కనిపించే లోపాలను, ఒక వృత్తిలోని చీకటి కోణాన్ని మాత్రమే సినిమాలో చూపించానని వివరించారు. కొందరి నిజ జీవితంలో జరిగే సంఘటనలు మాత్రమే తెరపై చూపించే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు.

ఇక చాలా కాలం తర్వాత రవితేజకు ఇరుముడి చిత్రంతో విజయం లభించింది. కాగా ఈ సినిమా పై చెలరేగిన వివాదం ఇంతటితో సమసిపోతుందా? లేక మరేదైనా మలుపు తీసుకుంటుందా? అనేది ఫిలిమ్ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

#Tollywood#movie#Irumudi#ravi-teja#teachers-federation-demands#controversial-scenes#AP
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి