మియాపూర్‌లో భర్తను హత్య చేసి మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన మరోఘటనలో నిజానిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.భోజనంలో నిద్ర మాత్రలు కలిపి దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను హత్యచేసిన భార్య.. ప్రియుడి సాయంతో కారులో మృతదేహాన్ని మహారాష్ట్రలోని తుల్జాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేసినట్టు తెలిసింది.
మృతదేహం పాక్షికంగా కాలడంతో అనుమానాస్పద మృతిగా మహారాష్ట్ర పోలీసులు కేసు ఫైల్ చేశారు. కాగా, హైదరాబాద్ తిరిగి వచ్చి తన భర్త కనిపించడంలేదని సత్యవతి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుడు పెంటేష్ చివరిసారిగా బేగంపేట ప్రాంతంలో ఫోన్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించగా.. ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా పోలీసులకు ఆచూకి చిక్కలేదు. చివరకు సత్యవతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పెంటేశ్ బంధువులు పోలీసులకు సమాచారం ఇావ్వగా.. ఆమె వివాహేతర సంబంధం బయటపడింది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు.
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ – మియాపూర్ పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో తనకున్న సొంత అపార్ట్మెంట్లు అద్దెకు ఇస్తూ మల్లాని పెంటేష్(52) అనే వ్యక్తి జీవనం కొనసాగిస్తున్నాడు.పదేళ్ల క్రితం భార్యతో విభేదాలు తలెత్తడంతో,పిల్లలను భార్య వద్దే వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు.ఈ నేపథ్యంలో పెంటేష్ నివసిస్తున్న అపార్ట్మెంట్లో పనికోసం చేరి ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సత్యవతి(40) అనే మహిళ దగ్గరైంది. తనకు ముందే పెళ్లయిన విషయాన్ని దాచి పెంటేష్‌ను సత్యవతి మళ్లీ వివాహం చేసుకుంది.
కొద్దిరోజులకు అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మధుసూదన్ రెడ్డి(38) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో మధుసూదన్ ఇల్లును భర్త పెంటేష్ ఖాళీ చేయించాడు.దీంతో పెంటేష్‌ను హతమార్చాలని నిర్ణయించుకుని, గత ఏడాది నవంబర్ 19న పెంటేష్‌కు నిద్రమాత్రలు కలిపిన భోజనం పెట్టి, స్పృహ కోల్పోయాక మధుసూదన్ రెడ్డితో కలిసి మొహంపై దిండు పెట్టి భార్య సత్యవతి ఊపిరాడకుండా చేసింది.అనంతరం బాడీని కారులో తరలించి మహారాష్ట బోర్డర్‌లో దహనం చేసి ఏం తెలీయకుండా నటించి మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది.












