తెలంగాణ

Highcourt : చెబితేనే పని చేస్తారా? ‘రెవెన్యూశాఖ’పై హైకోర్టు ఆగ్రహం!

రచన: Desk 13 నిమిషాల పఠనం

రాష్ట్రంలో రెవెన్యూ శాఖ పనితీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన 20 గుంటల భూమిని ఆర్డీవో, తహసీల్దార్ మ్యుటేషన్ చేయడంలేదని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్ పల్లె గ్రామానికి చెందిన లోకనడిపి హనుమాండ్లు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రాష్ట్రంలో రెవెన్యూ శాఖ పనితీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన 20 గుంటల భూమిని ఆర్డీవో, తహసీల్దార్ మ్యుటేషన్ చేయడంలేదని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్ పల్లె గ్రామానికి చెందిన లోకనడిపి హనుమాండ్లు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్తానం.. ప్రజలు అప్లికేషన్లు పెట్టుకుని నెలలు గడుస్తున్నా భూ సర్వేలు చేయకపోవడం, మ్యుటేషన్లు చేయకపోవడం, పాస్ పుస్తకాలు జారీ చేయకపోవడం ఏంటని ప్రశ్నించింది. ఇటువంటి ఫిర్యాదులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయని హైకోర్టుఅభిప్రాయపడింది.

‘హైకోర్టు చెప్తేనే పని చేస్తారా? పాస్ పుస్తకాల కోసం 3 నెలలు, భూ సర్వే కోసం 6 నెలల సమయం పడుతుందా? అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెంది ప్రజలు హైకోర్టుకు వస్తున్నారు. హైకోర్టు చెప్పకపోతే మీ పని మీరు చేయలేరా?’అంటూ రెవెన్యూ శాఖ అధికారులపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించడంతో పాటు కేసును నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించింది.

https://x.com/TeluguScribe/status/2074711367953891413?s=20

#highcourt#revenue department#hyderabad#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి