టాప్ న్యూస్

‘ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను’.. అభిమాని మృతి పట్ల పవన్ కల్యాణ్ భావోద్వేగం

రచన: Desk 33 నిమిషాల పఠనం

జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన అభిమాని నిరంజన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితమే హనుమకొండలో నిరంజన్‌ను స్వయంగా కలిసి పరామర్శించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పవన్ కల్యాణ్ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు.

 జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన అభిమాని నిరంజన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితమే హనుమకొండలో నిరంజన్‌ను స్వయంగా కలిసి పరామర్శించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పవన్ కల్యాణ్ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూ కన్నుమూసిన తన ప్రియమైన చిన్నారి అభిమాని నిరంజన్ మరణవార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందంటూ  పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.

 "కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి అతన్ని కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి" అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 నిరంజన్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ చూపించిన ఆత్మవిశ్వాసాన్ని గుర్తుచేసుకుంటూ.. "అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం" అని పేర్కొన్నారు.

 నిరంజన్ కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అతని కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ తీరని లోటును, బాధను భరించే శక్తిని భగవంతుడు ఆ కుటుంబానికి ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. "ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి" అంటూ పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.

https://x.com/PawanKalyan/status/2074746985425560036?s=20

#PawanKalyan#FanNiranjanDemise#Hanumakonda#JanasenaParty#EmotionalTribute#RestInPeaceNiranjan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి