రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను సమస్యలు వెంటాడుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. తాగడానికి నీళ్ళు ఇవ్వాలని హాస్టల్స్ నుంచి బయటకు వచ్చిన నిరసనలు చేపట్టారు.
నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని బాలికల హాస్టల్‌లో తాగునీరు, రోజువారీ అవసరాల కోసం నీళ్లు లేవని, ఈ సమస్య తీవ్రంగా ఉందని విద్యార్థినుల ఆందోళన తెలుపుతున్నారు. హాస్టళ్లకు సరఫరా కావాల్సిన నీటిని నూతన భవనాలకు మళ్లించారని, వెంటనే నీటి సమస్యను, మెస్ నిర్వహణ సరిగ్గా చేయాలని అర్ధరాత్రి వీసీ గెస్ట్ హౌస్ ముందు విద్యార్థినులు నిరసనకు దిగారు.
తమ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, కాంగ్రెస్ సర్కార్ విద్యార్థుల సమస్యలను గాలికొదిలేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.












