రాజకీయాలు

Harish Rao : చంద్రబాబు కోసమే రేవంత్ నీళ్లు ఎత్తిపోవడం లేదు : హరీశ్ రావు

రచన: Desk 13 నిమిషాల పఠనం

మేడిగడ్డ వద్ద నీళ్లు వృథాగా పోతున్నా ఏపీ సీఎం చంద్రబాబు కోసమే సీఎం రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. వర్షాలు లేక నీళ్లు లేవని చెప్పడం సరికాదన్నారు.

మేడిగడ్డ వద్ద నీళ్లు వృథాగా పోతున్నా ఏపీ సీఎం చంద్రబాబు కోసమే సీఎం రేవంత్ రెడ్డి నీళ్లు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. వర్షాలు లేక నీళ్లు లేవని చెప్పడం సరికాదన్నారు. గోదావరిలో నీళ్లు ఉన్నా ఎత్తిపోయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకి వస్తుందని ఫైర్ అయ్యారు. మిమ్మల్ని ఉరి తీసినా తప్పు లేదు అని అన్నారు.

చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నాడు అని ఆరోపించారు.ఈరోజు కూడా సమ్మక్క సాగర్ బ్యారేజీలో 1,08,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని, దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు కలిపి ఒక్కరోజులో 2,542 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయవచ్చు అని పేర్కొన్నారు. సాధారణంగా దేవాదుల మోటర్లు 71 మీటర్ల నీళ్లు ఉంటే పనిచేస్తాయని, కానీ ఇప్పుడు 75 మీటర్ల నీళ్లు ఉన్నాయని వివరించారు. అంటే నీళ్లు ఉండి కూడా కావాలని ఎత్తిపోయడం లేదని..

దేవాదుల ప్రాజెక్టులో సగానికి పైగా మోటర్లు అసలు ఆన్ చేయలేదని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 80% చెరువులు ఎండిపోయాయని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.

https://x.com/TeluguScribe/status/2074749462824776147?s=20

#harishrao#cm revanth reddy#kaleshwaram#godavari water
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి