సినిమా

Bollywood: చ‌ర‌ణ్‌కు తెగ న‌చ్చేసిన సినిమా.. ` బేబి దో డై దో`..!

రచన: Desk 75 నిమిషాల పఠనం

Bollywood: టైటిల్స్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఒక విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. మాట్లాడలేక, వినపడకపోయినా.. తనకున్న అసాధారణ నైపుణ్యాలతో ఒక ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారిన 'బేబి' అనే మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చిన్నతనంలోనే తన కళ్లెదుట చెల్లెలిని దారుణంగా చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ఆమె లక్ష్యం.

Bollywood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏదైనా సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారంటే, అందులో కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. సాధారణంగా మన స్టార్ హీరోలు పెద్ద సినిమాలను, లేదా తమకు అత్యంత సన్నిహితులైన వారి ప్రాజెక్టులను ప్రమోట్ చేయడం చూస్తుంటాం. కానీ, రీసెంట్‌గా రామ్ చరణ్ బాలీవుడ్‌కు చెందిన ఒక చిన్న సినిమాను ప్రత్యేకంగా అభినందించడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్‌ఆర్‌ఆర్‌లో తనకు జోడిగా నటించిన ఆలియా భట్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'అల్ఫా' రిలీజైనప్పుడు పెద్దగా స్పందించని చరణ్, ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేని 'బేబి దో డై దో' అనే వైవిధ్యమైన సినిమాను పొగడటంతో.. అసలు ఈ చిత్రంలో ఏముందోనని సినిమా లవర్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.

టైటిల్స్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం ఒక విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. మాట్లాడలేక, వినపడకపోయినా.. తనకున్న అసాధారణ నైపుణ్యాలతో ఒక ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ కిల్లర్‌గా మారిన 'బేబి' అనే మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చిన్నతనంలోనే తన కళ్లెదుట చెల్లెలిని దారుణంగా చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ఆమె లక్ష్యం. ఈ క్రమంలో ముంబై మాఫియా డాన్ జాఫర్ గ్యాంగ్‌లో చేరిన బేబి, అనుకోకుండా ఒక ప్రమాదంలో ఆ గ్యాంగ్ మెంబర్‌నే చంపేస్తుంది. ఆ తర్వాత ఎలాగైనా పెళ్లి చేసుకుని ఈ క్రైమ్ ప్రపంచం నుంచి పారిపోవాలనుకున్న ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? మాఫియా ముఠా నుండి ఆమె ఎలా తప్పించుకుంది? అనేదే ఈ సినిమా కథాంశం.

దర్శకుడు సచికేత్ సామంత్ ఈ చిత్రాన్ని చాలా భిన్నమైన టోన్‌లో వెండితెరపై ఆవిష్కరించారు. ముఖ్యంగా ముంబై అండర్ వరల్డ్‌ను సరికొత్త కోణంలో చూపించడంలో ఆయన సఫలమయ్యారు. సినిమా ప్రథమార్ధం చాలా గ్రిప్పింగ్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతుంది. అయితే, ద్వితీయార్ధానికి వచ్చేసరికి కథనంలో వేగం తగ్గడం, ట్విస్టులన్నీ ముందే ఊహించేలా ఉండటం థ్రిల్ ఫ్యాక్టర్‌ను కాస్త దెబ్బతీసింది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ముగియడం కొసమెరుపు. అయినప్పటికీ, బోర్ కొట్టించకుండా సాగే స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్‌గా నిలిచింది. హ్యూమా ఖురేషి తన నటనతో వన్‌మెన్ షో చేయగా, సికందర్ ఖేర్, చుంకీ పాండేలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మరి రామ్ చరణ్ అంతలా రికమండ్ చేసిన ఈ సినిమాను చూడొచ్చా అంటే.. మీరు క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడేవారైతే ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నించవచ్చు. భారీ అంచనాలు పెట్టుకోకుండా ఓటిటిలో టైమ్ పాస్ కోసం చూసేందుకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ సినిమాలతో విసుగు చెందిన ప్రేక్షకులకు, ఈ మధ్యకాలంలో వచ్చిన 'అల్ఫా', 'వెల్కమ్ టు ది జంగల్' వంటి చిత్రాల కంటే ఈ 'బేబి దో... డై దో' ఒక ఫ్రెష్ ఫీలింగ్‌ను ఇస్తుందనడంలో సందేహం లేదు.

#ramcharan. bollywood#BabyDoDieDo#HumaQureshi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి