పసిడి ప్రియులకు మరోసారి శుభవార్త.. గత రెండ్రోజులుగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ దిగి వచ్చాయి. పసిడితో పాటే వెండి ధరలు సైతం అమాంతం తగ్గాయి.ఆషాఢమాసం సేల్‌కు బంగారం వ్యాపారులు సైతం సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది.భారతీయుల వద్ద 415 లక్షల టన్నుల బంగారం ఉందని ఇటీవల ఓ నివేదిక బయటకు రాగా.. అంతా షాక్ అయ్యారు. ఏది ఏమైనా బంగారం కొనడంలో భారతీయుల తర్వాతే ఎవరైనా అని అనుకుంటున్నారు.
ఆగస్టులో మంచి ముహూర్తాలు ఉండటంతో సేల్స్ మరింత పెరుగుతాయని తెలుస్తోంది.ఇదిలాఉండగా. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగానూ బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. బుధవారం మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.770 మేర తగ్గి రూ.1,44,490కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారిలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.700 పతనమై రూ.1,32,450 పలుకుతోంది.
ఇక బంగారంతో పాటే వెండి ధర కూడా భారీగా తగ్గింది. మార్కెట్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ.5 వేల తగ్గి రూ.2,45,000కి చేరింది.వరుసగా ధరలు తగ్గుతుండటంతో మార్కెట్లలో కొనుగోళ్ల సందడి పెరిగే అవకాశం కనిపిస్తోంది.కాగా, నగరాలు, ప్రాంతాలు, రాష్ట్రాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.












