సినిమా

Raviteja - Sree Vishnu: "వీరాధి వీరులంట" ..ఈ క్రేజీ టైటిల్ ఓకేనా?

రచన: Desk 74 నిమిషాల పఠనం

Raviteja - Sree Vishnu: మాస్ మహారాజ రవితేజ, డీసెంట్ హీరో శ్రీవిష్ణు కలయికలో ఓ సినిమా ఉండబోతుందని చాలారోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇదొక డిఫరెంట్ మల్టీస్టారర్ మూవీ అని..సినిమా మొత్తం కామెడీతో ఆకట్టుకుంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో మాట్లాడుకుంటున్నారు.

Raviteja - Sree Vishnu: మాస్ మహారాజ రవితేజ, డీసెంట్ హీరో శ్రీవిష్ణు కలయికలో ఓ సినిమా ఉండబోతుందని చాలారోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇదొక డిఫరెంట్ మల్టీస్టారర్ మూవీ అని..సినిమా మొత్తం కామెడీతో ఆకట్టుకుంటుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో మాట్లాడుకుంటున్నారు. అయితే, దీనిపై అధికారికంగా మేకర్స్ నుంచి కన్‌ఫర్మేషన్ రానప్పటికీ ఓ క్రేజీ టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఆ టైటిల్ ఏంటీ..అది ఈ మల్టీస్టారర్ మూవీకి సూటవుతుందా అనే విషయాలను పూర్తి కథనంలో చూద్దాం.

రవితేజ అంటే పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా ఉంటుందని అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌లో మన మాస్ మహారాజ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. నిర్మాతలు కూడా రవితేజతో సినిమా చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇక, దర్శక-రచయితలైతే ఆయన ఇమేజ్‌కి తగ్గ కథలను తెగ రాసేస్తుంటారు. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్న వారిలో రవితేజ, బాలకృష్ణ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక, ఫ్యామిలీ హీరోగా డీసెంట్ చిత్రాలతో వచ్చి అలరిస్తున్న శ్రీవిష్ణు కి కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా ఈ హీరో ఎంచుకునే కథలు చాలా వైవిధ్యంగా ఉంటున్నాయి. ఇప్పుడు, వీరిద్దరు కలిసి ఓ సినిమాను చేయబోతున్నారనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. హసిత్ గోలి ఈ సినిమాకి దర్శకత్వం వహితున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారట.

ఇక, ఈ మల్టీస్టారర్ మూవీకి ఓ వెరైటీ టైటిల్ పరిశీలిస్తున్నారని, దాదాపు ఆ టైటిల్ నే ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, ఆ టైటిల్ "వీరాధి వీరులంట". ఈ టైటిల్ వింటేనే ఎంతో ఆసక్తికరంగా ఉంది. హీరోల పాత్రలు ఎంత ఫన్‌తో ఉండబోతున్నాయో కూడా అర్థమవుతోంది. ఒకవేళ ఇదే గనక టైటిల్ అయితే, గ్యారెంటీగా రవితేజ మార్క్ మాస్ కామెడీ..శ్రీవిష్ణు స్టైల్ ఆఫ్ డీసెంట్ పంచులతో థియేటర్స్ దద్దరిల్లిపోతాయి.

#raviteja#srivishnu#hasith goli#veerathi veerulanta
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి