తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావిస్తాం. కానీ, కొందరు గురువులు ఆ వృత్తికి కళంకం తీసుకొస్తున్నారు. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులను కామంతో చూస్తున్నారు. వారితో తమ లైంగిక వాంఛలను తీసుకోవాలని చూస్తున్నారు. ఇటీవలి కాలంలో స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు పెరిగిపోయాయి. ప్రస్తుత పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్‌లో వెలుగుచూసింది.
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రిన్సిపల్ విద్యార్థినిపై లైంగికి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఓ విద్యార్థిని 2025లో పీజీ పూర్తి చేసింది. తనకు టీసీ ఇవ్వాలని ప్రిన్సిపల్‌ను కోరగా.. ఇంటికి వస్తే ఇస్తానని సదరు ప్రిన్సిపల్ చెప్పాడు. దీంతో తన ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిన విద్యార్థినిపై ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్.. లైంగికంగా, మానసికంగా దాడికి పాల్పడినట్టు సమాచారం. ముందస్తు ప్లాన్ ప్రకారమే.. ప్రిన్సిపల్.. రాత్రి 10 గంటలకు తన ఇంటికి విద్యార్థిని పిలిపించుకొని లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. చిత్రహింసలకు గురి చేస్తుండడంతో ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికి విద్యార్థిని తప్పించుకుంది. దీంతో ప్రిన్సిపల్ నగ్నంగా పారిపోయినట్టు సమాచారం.
అనంతరం బాధిత విద్యార్థిని రాత్రి పోలీస్‌స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు తక్షణమే ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












