సినిమా

Rishab Shetty: కాంతార చాప్టర్ 2 పై అప్పుడే క్లారిటీ ఇచ్చేశాడుగా!

రచన: Desk 74 నిమిషాల పఠనం

Rishab Shetty: కన్నడ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ పాన్ ఇండియన్ సినిమాలు నిర్మిస్తారని నిరూపించిన వారిలో నిర్మాణ సంస్థలు హోంబలే, దర్శకులు ప్రశాంత్ నీల్, హీరోలు యష్, రిషబ్ శెట్టి ఉన్నారు. కేజీఎఫ్ సిరీస్ తో యష్, కాంతార సిరీస్ తో రిషబ్ కన్నడ ఇండస్ట్రీ స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించారు. అయితే, తాజాగా కాంతార చిత్రానికి మరో భాగం కూడా ఉందని.. ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో అనే విషయాన్ని రిషబ్ స్వయంగా తెలిపాడు.

కాంతార సినిమాతో అటు కన్నడ, ఇటు తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. స్వీయ రచనా, దర్శకత్వంలో వచ్చిన కాంతార, కాంతార చాప్టర్ 1 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్ ని రాబట్టాయి. దీనిలో భాగంగా కాంతార చాప్టర్ 2 కూడా ఉందనే విషయం తెలిసిందే. అయితే, అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో నిన్నా మొన్నటి వరకూ క్లారిటీ లేదు.

తాజాగా, దీనిపై క్రేజీ అప్‌డేట్ ని ఇచ్చాడు రిషబ్. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాను చేస్తున్నాడు. అలాగే, ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమాని పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలలోను పాత్రలు ఒకదానికి ఒకటి పూర్తి భిన్నంగా ఉండటంతో ముందుగా వీటిని కంప్లీట్ చేసి..ఆ తర్వాత కాంతర చాప్టర్ 2 ని సెట్స్‌పైకి తీసుకురానున్నట్టుగా రిషబ్ శెట్టి తెలిపాడు.

అప్పటి వరకూ ఈ సినిమాకి సంబందించిన కథ, స్క్రీన్ ప్లే సహా ఇతర పనులను చేయనున్నట్టుగా వెల్లడించాడు. మొత్తానికి, కాంతార ఛాప్టర్ 2 ఉంటుందా..ఉండదా అనే సందేహాలకి స్వయంగా రిషబ్ శెట్టి క్లారిటీ ఇవ్వడంతో..ఆ మూవీ లవర్స్ ఆనందపడుతున్నారు. కాంతార సిరీస్ ని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో, ఎంజాయ్ చేశారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలతో మంచి లాభాలు వచ్చాయి.

#RishabShetty#kanthara 2#kannada movieupdates#latestnews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి