ఏపీ

Missing Case : కిడ్నాప్ చేస్తే అప్పగించండి.. కేసులు పెట్టం : ఏపీ పోలీస్

రచన: Desk 13 నిమిషాల పఠనం

ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ నెల రోజులు గడిచినా లభ్యం కాలేదు. డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో పోలీసు, అటవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అడవులు, బావులను జల్లెడ పట్టాయి

ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ నెల రోజులు గడిచినా లభ్యం కాలేదు. డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో పోలీసు, అటవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అడవులు, బావులను జల్లెడ పట్టాయి. తాజాగా పాపను సురక్షితంగా అప్పగిస్తే ఎలాంటి చర్యలు తీసుకోమని పోలీసులు ప్రకటించారు.చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేస్తే క్షేమంగా అప్పగిస్తే వారిపై ఎలాంటి కేసు లేకుండా చూస్తామని కాకినాడ పోలీసులు కీలక ప్రకటన చేశారు.

ఒకవేళ అప్పగించే ధైర్యం లేకపోయినా కనీసం జాడ తెలిపినా వెళ్లి తీసుకొస్తామని తెలిపారు. కేసులు పెట్టడం కంటే చిన్నారిని తల్లి దగ్గరికి క్షేమంగా చేర్చడమే ముఖ్యమని వెల్లడించారు. అయితే, ఫోన్ వాడని మనుషులే పాపని ఎత్తుకెళ్లి ఉంటారని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. ఇదిలాఉండగా, చిన్నారి ఆచూకీ తెలిపితే రూ.లక్ష పారితోషకం అంటూ గోడ పత్రికలను సైతం పోలీసులు అంటిచారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చుట్టుపక్కల జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అంటించారు. ఈ కేసు కాకినాడ పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.

https://x.com/TeluguScribe/status/2074503125881536788?s=20

#Gnaneshwari#missing#kakinada#police#no information
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి