Raaka: అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది సుకుమార్. ఒకరకంగా చెప్పాలంటే ఈ రెండు క్రేజీ స్టార్ ఇమేజెస్ తెచ్చింది సుక్కూనే అని చెప్పాలి. అలాంటి, ఐకాన్ స్టార్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో ఓ గ్లామర్ బ్యూటీకి ఛాన్స్ వస్తే నో చెప్పిందట. అలాంటి, ఛాన్స్ ని ఏ ఒక్కరూ మిస్ చేసుకోరు. మరి, ఆ అన్ లక్కీ హీరోయిన్ ఎవరో పూర్తి వివరాలలోకి వెళ్ళి తెలుసుకుందాం.
పుష్ప ఫ్రాంఛైజీస్ తర్వాత అల్లు అర్జున్ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొన్ ఇందులో మేయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, రష్మిక మందన్న..మృణాల్ ఠాకూర్ సహా మరికొంతమంది క్రేజీ హీరోయిన్స్ కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
అలాంటి, క్రేజీ హీరోయిన్స్‌లో ప్రీతి ముకుందన్ కూడా ఉంది. కానీ, ఈ బ్యూటీకి డేట్స్ సర్దుబాటు కాక.. రాకా చిత్రాన్ని వదులుకుందని స్వయంగా దర్శకుడు అట్లీ వెల్లడించాడు. తెలుగులో కన్నప్ప సినిమాలో కనిపించిన ప్రీతి ఇటీవల అర్జున్ సర్జా, అభిరామి నటించిన బ్లాస్ట్ మూవీలో వారికి కూతురు పాత్రలో నటించి ఆకట్టుకుంది. అందం, అభినయం మాత్రమే కాదు, భారీ యాక్షన్స్ ఎపిసోడ్స్‌లోనూ అదరగొట్టింది ప్రీతీ ముకుందన్.
ఇటీవల జరిగిన ‘ఇదయమ్ మురళీ’ అనే సినిమా ఈవెంట్ కి అతిధిగా వెళ్లిన అట్లీ, ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ప్రీతి కి డేట్స్ కుదరకపోవడంతో ఆ రోల్ ని ఫెమినా జార్జ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. ఏదేమైనా భారీ పాన్ వరల్డ్ సినిమాను మాత్రం ప్రీతి ముకుందన్ మిస్ అయిందనే చెప్పాలి. కాగా, ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. 2027లో ప్రపంచవ్యాప్తంగా రాకా చిత్రాన్ని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.












