తెలంగాణ

Warangal: జనసేనాని వీరాభిమాని నిరంజన్ కన్నుమూత

రచన: Desk 33 నిమిషాల పఠనం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని, వరంగల్‌కు చెందిన తోట నిరంజన్(17) అనారోగ్యంతో కన్నుమూశాడు. గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని, వరంగల్‌కు చెందిన తోట నిరంజన్(17) అనారోగ్యంతో కన్నుమూశాడు. గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. నిరంజన్ మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

నిరంజన్ జీవితం చిన్నతనం నుంచే ఎన్నో సవాళ్లతో సాగింది. కేవలం మూడేళ్ల ప్రాయంలోనే ఆయన ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి ప్రభావం వల్ల వయసు పెరుగుతున్నా శారీరక ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో 17 ఏళ్ల వయస్సు వచ్చినప్పటికీ, ఆయన బాహ్య రూపం మాత్రం కేవలం నాలుగేళ్ల చిన్నారిలానే ఉండిపోయింది.

శారీరక వైకల్యం వేధిస్తున్నా, పవన్ కల్యాణ్ అంటే నిరంజన్‌కు ప్రాణ సమానమైన అభిమానం. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా జనసేనాని దృష్టికి వెళ్లడంతో, ఆయన ఇటీవల వరంగల్‌లోని నిరంజన్ నివాసానికి స్వయంగా విచ్చేశారు. నిరంజన్‌ను ప్రేమతో దగ్గరకు తీసుకుని, కాసేపు ముచ్చటించి పరామర్శించారు. ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తన అభిమాన హీరోను కలుసుకుని మురిసిపోయిన నిరంజన్, అంతలోనే తిరిగిరాని లోకాలకు తరలిపోవడం అందరినీ కలచివేస్తోంది. నిరంజన్ ఆకస్మిక మృతి పట్ల జనసేన నాయకులు, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి