OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ గుడ్ న్యూస్ చెప్పాడు. అదేమిటంటే ఓజీ 2 ఎప్పుడు సెట్స్ పైకి రాబోతుందో రివీల్ చేశాడు థమన్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ (ఓజాస్ గంభీర) బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. పవన్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇటు సుజీత్, అటు థమన్ ఈ సినిమాకి ఏ స్థాయిలో కష్టపడ్డారో పవన్ మాటల్లో విన్నాము. ఒక అభిమాని దర్శకుడు, సంగీత దర్శకుడు అయితే..ఓజీ లాంటి సినిమాలే వస్తాయని పవన్ అన్న మాటలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. అప్పుడే, ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు సుజీత్ క్లారిటీ ఇచ్చాడు.
అయితే, పవన్ కళ్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎం గా ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఇలాంటి బిజీ సమయంలో ఆయన మళ్ళీ సినిమాలకి డేట్స్ ఇవ్వగలరా? అనే సందేహాలు అందరిలోనూ కలిగాయి. కానీ, ఎప్పుడో ప్రకటించిన సురేందర్ రెడ్డి సినిమాను పట్టాలెక్కించనున్నట్టు ప్రకటించగానే మళ్ళీ, అందరికీ ఉత్సాహం రెట్టింపైంది. ఇదే, క్రమంలో మొన్నామధ్య దర్శకుడు సుజీత్, పవన్ ని కలిసి ఓజీ 2 కథ నరేట్ చేసిన వీడియో అంతటా వైరల్ అయింది. ఖచ్చితంగా ఓజీ 2 ఉందని తేలిపోయింది.
దీనికి తాజాగా, ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనే కాకుండా.. సినీ లవర్స్‌లోనూ క్యూరియాసిటీని పెంచాడు. సెప్టెంబర్ నుంచి ఓజీ 2 సెట్స్‌పైకి రాబోతుంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై ఈ ఫ్రాంచైజీ రూపొందనుంది. స్టైలిష్ గ్యాంగ్ స్టర్ అవతారంలో పవన్ కళ్యాణ్ మరింత ఓల్టేజ్‌తో రాబోతున్నాడని కన్‌ఫర్మ్ అయింది.












