స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Kaleshwaram Stories Continue

రచన: Swechaanews Chaiman6 నిమిషాల పఠనం

కాళేశ్వరం పై నాయకుల కహానీలు కొనసాగుతునే ఉన్నాయి. రైతాంగానికి నీళ్లు ఎలా ఇవ్వొచ్చో చొరవ చూపకుండానే నీళ్ల పై నిప్పులు చెరిగేలా మాట్లాడుకుంటున్నారు. సవాళ్లు విసురుకుని సాగతీస్తున్నారు. ప్రజలకు ప్రత్యేక్షంగా ఏం జరుగుతుందో వివరించలేని పరిస్థితి ప్రభుత్వంలో కొట్టొంచ్చినట్లు కనిపిస్తుంది.

వచ్చే కొద్దిపాటి నీళ్లనైనా ఎత్తిపోసే పరిస్థితి ఉందా లేదా?

- రైతాంగానికి నీళ్లు ఎలా?

-- బీఆర్‌ఎస్ మైండ్ గేమ్‌ని టెక్నికల్‌గా ఎదుర్కొనలేక పోతున్న కాంగ్రెస్?

- గడ్డు కాలానికి.. గుడ్డిగా రోజు లెక్కలు చెప్పితే ప్రజలు నమ్ముతారా?

- సవాళ్లతో సమస్య పరిష్కారం అవుతుందా?

- ప్రజల మెదళ్లలో మెదులుతున్న ప్రశ్నలు ఏంటి?

స్వేచ్ఛ చైర్మన్ స్పెషల్ స్టోరీ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

కూలిందనే వాళ్లను కూల్చివేశారు.. మీరు నిలబెట్టలేరా?

లక్ష 30 వేల కోట్ల ప్రాజెక్ట్ లో 45 వేల కోట్లు వృథా ఖర్చే అని ఎంతోమంది నిఫుణులు చెప్పారు. ఆర్ధిక ఉగ్రవాదుల్లా దోచుకున్నది నిజమేనని కాంగ్రెస్ మాటలను ప్రజలు నమ్మారు. కూలిందని మిమ్మల్ని నిలబెట్టారు. ఇకనైనా కాళేశ్వరం కహానీలను ఆపాలని తెలంగాణ రైతాంగం కోరుకుంటోంది. గోదావరిలో తాజాగా ప్రవహిస్తున్న నీళ్లు ఎంత? కన్నెపల్లి పంపు హౌజ్ కి ఎన్ని నీళ్లు చేరుకుంటాయి? ఆ నీటిని ఎత్తిపోత్తే ఎంత ఖర్చు అవుతుంది? కరెంట్ వ్యవస్థ కుప్పకూలిందా? మోటర్లతో పాటు మిగితా వ్యవస్థ మెంటనెన్స్ కి ఏం చేయాలి? ఎన్ని రోజుల్లో వీలైనంతా నీళ్లను ఎత్తిపోయవచ్చు అనే అంశాలను ప్రభుత్వం పరిశీలించాలి. బీఆర్ఎస్ నేతల నోళ్లు మూయించాలంటే మోటార్లు ఆన్ చేయాలని రైతుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. రిజర్వాయర్లలో నీళ్లు నిలవకపోతే ఎత్తిపోయడం సాధ్యం కాదని నిరూపించలేకపోవడంతో రైతుల్లో విమర్శలు పెరుగుతున్నాయి.

వర్షాలపై ఆశలు.. ఈ ఏడాది కష్టమే?

ఎల్ నినోతో జూలైలో ఉత్తర తెలంగాణలో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఆశలు పెట్టుకుంది ప్రభుత్వం. దీంతో గత 2 ఏండ్లుగా చుక్క నీరు ఎత్తి పోయకుండానే నీళ్లు ఇచ్చామని ధీమాతో ఉంది. రికార్డ్ స్థాయిలో పంటలు పండాయని చెప్పుకుంటోంది. కానీ ఈసారి అలాంటి పరిస్థితులపై ప్రజలు నమ్మకంగా లేరు. వర్షం ఇప్పటికే 20 శాతం డిఫిసిటీ ఉందని తెలిసిపోయింది. లక్ష కోట్ల ప్రాజెక్ట్ గా సెటిమెంట్‌తో ఉన్న ప్రజలకు నీళ్లు ఎత్తిపోస్తే కచ్చితంగా పంటలు పండుతాయనే ఆశతో ఉన్నారు. ప్రభుత్వం గుర్తించకపోతే వాళ్లకు వివరంగా చెప్పకపోతే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డ కాంగ్రెస్?

పాత లెక్కలు సరే, తాజా పరిస్థితి ఏంటని బీఆర్ఎస్, కాళేశ్వరాన్ని గట్టిగా వాడుకుంటోంది. దీన్ని మొదట్లోనే మంత్రులు, పార్టీ పెద్దలు గట్టిగా తిప్పికొట్టి అక్కడ ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు అద్దం పట్టేలా చూపించాల్సిన అవసరం ఉంది. కానీ నేరుగా కేటీఆర్ వెళ్లడం, వారం రోజులు కొంత మంది అధికారులను కేసీఆర్ కి అప్పగిస్తే నీళ్లు ఎత్తిపోస్తామని ప్రకటించడంతో రైతాంగం పూర్తిగా నమ్ముతోంది. ఈ ట్రాప్ లో కాంగ్రెస్ కూడా పూర్తిగా కూరుకుపోయింది. సీఎం నేరుగా దిగి పవర్ ప్రజెంటెషన్ ఇచ్చారు. దాని కంటే ఎక్కువ సవాళ్లు, అప్పులు, వడ్డీలు, కరెంట్ అంటూ మీడియాకు పాత ముచ్చట్లే ప్రచురించేలా ప్రెస్ నోట్లు పంపడంతో నీళ్ల నిపుణులు పెదవి విరుస్తున్నారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్

నీళ్ల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. ఆ నీళ్ల సెంటిమెంటే జీవానాధారంగా మారింది. దక్కన్ పీఠభూమిలో 10 శాతం తక్కువ వర్షం పడినా దాని ప్రభావం తాగు, సాగు నీటిపై ఎంతో ఉంటుంది. కాంగ్రెస్ వైపరిత్యాలను సోషల్ మీడియాలో పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అవుతూ సోషల్ మీడియాలో చర్చలు పెడుతున్నారు. సమర్ధవంతమైన సబ్జెక్ట్ కాంగ్రెస్ కార్యకర్తలకు లేకపోవడంతో వారు చతికిల పడుతున్నారు.

#swechaanews.com#kaleshwaram project#polictics#congress vs BRS#telangana farmers water issue
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి