సినిమా

Ram Pothineni: మ్యూజిక్ డైరెక్టర్ ని ఫిక్స్ చేసిన ఎనర్జిటిక్ స్టార్..

రచన: Desk 74 నిమిషాల పఠనం

Ram Pothineni: టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా రామ్ పోతినేని కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఈ హీరోకి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ఉంటున్నాయి. గత చిత్రం ఆంధ్రాకింగ్ తాలూకా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ, ఆశించిన కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. అయితే, ఈ సినిమాలో రామ్ పోతినేని రాసిన సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. లిరిక్ రైటర్ గా కూడా రామ్ పోతినేని నిరూపించుకున్నాడు.

ఇదే ఉత్సాహంతో ఇప్పుడు మెగా ఫోన్ పట్టాడు. రామ్ పోతినేని నటిస్తూ తొలిసారి తానే డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ మూవీ ఈ మధ్యనే ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ చిత్రాన్ని ‘#రాపో23’ అనే ట్యాగ్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకి సంగీత దర్శకుడెవరు అనే సస్పెన్స్ ఉంది. ఆ సస్పెన్స్ కి నేటితో తెర పడింది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సిఎస్ సంగీతం అందించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అంతేకాదు, ఒక స్పెషల్ గ్లింప్స్‌ను కూడా నేడు విడుదల చేశారు. ఇందులో, ‘ప్రతి ప్రపంచానికి ఒక శబ్దం ఉంటుంది.. ఈ ప్రపంచం విధ్వంసాన్ని శ్వాసిస్తోంది’ అంటూ సామ్ సిఎస్ ఎంట్రీని చిత్ర బృందం ఘనంగా ఆహ్వానిన్చింది. రామ్ పోతినేని నటిస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ మూవీకి సామ్ సిఎస్ అందించబోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని మేకర్స్ ధీమాను వ్యక్తం చేస్తోంది.

కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తుండగా, తిరు సినిమాటోగ్రాఫర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా ఫిక్సైయ్యారు. మిగిలిందల్లా హీరోయిన్ మాత్రమే. ప్రస్తుతానికి రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే, కయాదు లోహర్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి, మేకర్స్ అధికారికంగా ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి.

#rampothineni#samcs##rapo23#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి