సినిమా

Samantha: రూ.100 కోట్ల హీరోయిన్‌గా నిలుస్తుందా?

రచన: Desk 74 నిమిషాల పఠనం

Samantha: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషలలో కూడా ఎక్కువగా ఆధిపత్యం హీరోలదే ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన తెలుగు తో పాటు తమిళ ఇండస్ట్రీలు కంప్లీట్ ఫ్యాన్ బేస్డ్ గా ఉంటాయి. ఆ తర్వాత, కన్నడ..మలయాళ ఇండస్ట్రీలలోనూ ఈ ఫ్యాన్ బేస్డ్ హీరోలు ఎక్కువయ్యారు. అందుకే, ఎప్పుడో ఒకసారి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు.

అలా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనుష్క శెట్టి ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అరుంధతి సినిమాతో ఆమె 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ట్రెండ్ సెట్ చేసింది. ఆ తర్వాత 2018 లో కీర్తిన్ సురేష్ మహానటి సినిమాతో 80 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, మహానటి సినిమా ద్విభాషా చిత్రంగా చూడాలి. ఇక, ఇప్పుడు వీరిద్దరి రికార్డ్స్ ని సమంత బద్ధలు కొట్టిందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ ని సొంతం చేసుకుంది. తన భర్త రాజ్ నిడిమోరు అందించిన కథ, బీవి నందిని రెడ్డి డైరెక్షన్, సమంత మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్..ఇలా అన్నీ కలిసి దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టేందుకు బలమైన కారణాలయ్యాయి. వాస్తవానికి, ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ప్రమోషన్స్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి పాజిటివ్ టాక్ వినబడింది.

అలా మౌత్ టాక్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేటైంది. అలా, రిలీజైన 18 రోజులకి 96 కోట్ల గ్రాస్ కి చేరుకుంది. దాంతో ఈ వారం పూర్తయ్యేసరికి 100 కోట్ల మార్క్ ని చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే సౌత్‌లో 100 కోట్ల హీరోయిన్‌గా సమంత రికార్డ్ నమోదు చేస్తుంది. మొత్తానికి, లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా రికార్డ్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అయింది.

#samantha#maa inti bangaram#rajnidimoru#bvnandinireddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి