సినిమా

Keerthy-Krithi : అనిల్ రావిపూడి సినిమాతో లైఫ్ టర్న్ అవుతుందా?

రచన: Desk 74 నిమిషాల పఠనం

Keerthy-Krithi : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస అవకాశాలు, సూపర్ హిట్లు అందుకున్న హీరోయిన్స్ కీర్తి సురేష్, కృతి శెట్టి. కానీ, ఇదే హీరోయిన్స్‌కి వరుస ఫ్లాప్స్ వచ్చేసరికి అవకాశాలు పక్కదారి పట్టాయి. మళ్ళీ ఇంతకాలానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. కీర్తి సురేష్, కృతి శెట్టిలకి ఛాన్స్ ఇచ్చాడు. మరి, ఈ సినిమాతోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

అనిల్ రావిపూడి హిట్ ఇచ్చిన హీరోయిన్స్:

పటాస్ సినిమాతో శ్రుతి సోడి అనే హీరోయిన్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా తర్వాత ఒకసారి ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. మళ్ళీ కనిపించలేదు. రాశీ ఖన్నాకి సుప్రీమ్ సినిమాతో హిట్ ఇచ్చాడు. కానీ, ఈ బబ్లీ బ్యూటీ కి చెప్పుకునేంత గొప్ప అవకాశాలు దక్కలేదు. మెహ్రీన్ కి రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలలో అవకాశం ఇచ్చాడు. ఎఫ్ 2, ఎఫ్ 3 లలో తమన్నా కూడా నటించింది. కానీ, వీరిద్దరూ ఇప్పుడు కనిపించడం లేదు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ లకి సూపర్ హిట్ ఇచ్చాడు. వాళ్ళ పరిస్థితేంటో తెలిసిందే. మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో నయన్ మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తోంది. ఇప్పుడు, తెలుగులో అందరు మరిచిపోయిన కీర్తి సురేష్, కృతి శెట్టి లకి ఛాన్స్ ఇచ్చాడు. వీరికి గనక హిట్ పడితే, గ్యారెంటీగా టాలీవుడ్‌లో మళ్ళీ పుంజుకుంటారు.

వెంకీ సరసన కీర్తి, కళ్యాణ్ రామ్ సరసన కృతి:

అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో వెంకటేష్ కి జంటగా కీర్తి సురేష్ ని ఎంపిక చేయగా, నందమూరి కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టిని ఫిక్స్ చేశారు. ఓపెనింగ్ లో చూస్తే ఈ జంటలు అదిరిపోయాయి. కీర్తి కాస్త బొద్దుగా కనిపించి ఆకట్టుకుంది. కృతి నడుము అందాలతో హీట్ పెంచింది. ఖచ్చితంగా సాలీడ్ హిట్ మాత్రం దక్కుతుందనే నమ్మకం ప్రతీ ఒక్కరిలో ఉంది. అయితే, ఈ సినిమా సక్సెస్ మైలేజ్ మాత్రం కీర్తి, కృతి శెట్టిలకే చాలా కీలకం అని చెప్పాలి.

#keerthysuresh#krithishetty#anilravipudi#venkatesh#kalyanram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి