స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

రిజిస్ట్రేషన్ శాఖలో శాఖలో అవినీతికే అందలం. పీఏ నుంచి ఐజీ వరకు వసూళ్ల పర్వం ?

రచన: Swechaanews Chaiman14 నిమిషాల పఠనం

రెవెన్యూ శాఖలో రెచ్చిపోయి ఒక్కరిని మించి మరో శాఖ అవినీతికి పాల్పడుతున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో 8 మంది జిల్లా రిజిస్ట్రర్ ల బదిలీలు, ప్రమోషన్స్ పోస్టింగ్ తీరు పై అరోపణలు వినిపిస్తున్నాయి. రెండు సార్లు ఏసీబీ కి చిక్కిన వారికే పదవులు, సచివాలయంలో పనిచేయాల్సిన అధికారులకు జిల్లాల బాస్ గా ఇవ్వడం పై మంత్రి పొంగులేటి వైపే అందరి వేళ్లు చూపిస్తున్నారు.

- పోస్టింగ్ లోనూ తాండవిస్తున్న అవినీతి?

- బయట పడుతున్న రిజిస్ట్రేషన్ శాఖలో బదిలీల లీలలు

- రెండుసార్లు ఏసీబీకి చిక్కినా మంచి పోస్టింగులు

- వసూల్ రాయుళ్లపై ఫిర్యాదులు అందినా చర్యలు ఏవి?

- ప్రొహిబిటెడ్ పేరుతో అందినకాడికి దోచుకుని రిజిస్ట్రేషన్స్

- పీఏ దగ్గర నుంచి ఐజీల వరకు పోటీపడి

వసూలు చేసుకుంటున్న వైనం

- స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో జరగుతున్న

అవినీతి లీలలపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ చైర్మన్

భయం లేదు ? బాధ్యత లేదు.?

భయం లేని బాతు బజార్లో గుడ్డు పెట్టినట్లు ఉంది రెవెన్యూ శాఖలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారుల తీరు. చిన్న వివాదంలో లేఖ ఇచ్చిన సర్వే నెంబర్ మొత్తం ప్రోహిబిటెడ్ లోకి నెట్టేసి దందాలు చేసుకుంటన్నారు. లక్షల రూపాయలు తీసుకుని చేయరాని, చేయకూడని పనులు పూర్తి చేస్తున్నారు. చట్టంలోని లొసులగులను ఆసరాగా చేసుకుని చేస్తున్న ఈ వసూళ్లు బదిలీల్లో కోట్ల రూపాయలకు చేరుకోవడం విశేషం. గత నెల 30వ తేదీన జరిగిన డీఆర్(డిస్ట్రిక్ రిజిస్ట్రార్)ల బదిలీలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు జాయింట్ ఐజీగా గత నెల ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించిన సీనియర్ అధికారి ట్వింకిల్ ఝాను తొలగించి ఈనెల 4వ తేదీన జూనియర్ అధికారిణి(డీఐజీకి)కి బాధ్యతలు అప్పగించడంపై ఆ శాఖ ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అనుచరులకు పోస్టింగుల విషయంలో ముడుపులు డైరెక్ట్‌గా తీసుకోకుండా అనాథ ఆశ్రమంకు ఇచ్చేలా కథ నడిపిస్తారని అంటున్నారు. గత ప్రభుత్వంలో సోమేష్ కుమార్ అండదండలతో పదోన్నతులు పొంది సినియర్స్ పై కూడా చక్రం తిప్పారని వినికిడి. అన్ని విధాలుగా ఆరి తేలడంతో ఇప్పుడు అండగా మంత్రి నిలబడ్డారని తెలుస్తోంది.

రెండుసార్లు ఏసీబీకి చిక్కినా ఈసారి కూడా మంచి పోస్టింగా?

నలుగురికి డీఆర్‌లుగా పదోన్నతి కల్పించింది ప్రభుత్వం. ప్రణయ్ కుమార్ (అదే రోజు) రిటైర్ అయ్యారు. ఇక, వనజ కుమారి గతంలో రెండుసార్లు ఏసీబీకి చిక్కారు. దీంతోపాటు ఈమెపై అనేక అవినీతి ఆరోపణల నేపథ్యంలో చార్జీ మెమో సైతం ఇచ్చారు. అయినా, ప్రస్తుతం ఆమె డీఆర్‌గా పదోన్నతి పొంది సంగారెడ్డిలో పోస్టింగ్ దక్కించుకున్నారు. మేడ్చల్ స్పెషల్ ఇంట్రెస్ట్, మంత్రి నాకు క్లోజ్ , శ్రీనివాస్, రామ్‌జీలకు సైతం డీఆర్‌లుగా పదోన్నతి పొందారు. శ్రీనివాస్‌ను ఖమ్మం డీఆర్‌గా, రామ్‌జీ రంగారెడ్డి ఆడిట్ డీఆర్‌లుగాగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే, వీరిద్దరికి పదోన్నతులు ఇవ్వొద్దని మేడ్చల్ మల్కాజిగిరి డీఆర్ చిట్టిమల్ల అశోక్ అభ్యంతరం తెలిపినా కట్టబెట్టడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి డీఆర్ అశోక్‌ను ఎపీకి పంపిన తరువాతే శ్రీనివాస్, రామ్‌జీలకు పదోన్నతులు కల్పించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సైతం ఐజీ తుంగలో తొక్కడంపై ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, రామ్‌జీలు 2024 వరకు సచివాలయంలో పని చేశారు. చిట్టిమల్ల అశోక్ కేసు కోర్టులో నడుస్తుండగానే నిబంధనలకు విరుద్ధంగా 2025లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు శ్రీనివాస్, రామ్‌జీలు బదిలీపై వచ్చారు. 2026 జూన్ నెల వరకు చేవెళ్ల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో శ్రీనివాస్ గ్రేడ్ 1 సబ్ రిజిస్ట్రార్‌గా, రెడ్‌హిల్స్ సబ్ రిజిస్ట్రార్‌గా రామ్‌జీలు పనిచేశారు. అయితే, చిట్టిమల్ల అశోక్ కేసు ఇంకా కోర్టులో నడుస్తుండగానే శ్రీనివాస్, రామ్‌జీలకు డిఆర్‌లుగా పదోన్నతులు కట్టబెట్టాలని ఆ శాఖ ఐజీ నిర్ణయం తీసుకోవడంపై మేడ్చల్ మల్కాజిగిరి డిఆర్ చిట్టిమల్ల అశోక్ అభ్యంతరం తెలిపారు. అయినా గతనెల 30వ తేదీన పదోన్నతులు కల్పించిన నలుగురిలో శ్రీనివాస్, రామ్‌జీలు ఉండడం వారికి పోస్టింగ్‌లు ఇవ్వడంపై ఆ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ డీఆర్‌ల బదిలీల్లో భారీగా ముడుపులు చేతులు మారాయని కొంతమంది ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అశోక్‌ను మాత్రం రెండేళ్లు దాటినా అక్కడి నుంచి మాత్రం మార్చలేదు. ఆయనపై అనేక ఆరోపణలు వచ్చినా ఐజీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రశ్నార్ధకంగా మారింది. దీంతోపాటు 2 సంవత్సరాలకు పైగా ఓడీల పేరుతో ఇక్కడ తిష్ట వేసిన సబ్ రిజిస్ట్రార్లపై ఫిర్యాదులు అందినా వారిపై సంబంధిత శాఖ ఐజీ చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓడీల పేరుతో వచ్చిన కొందరు సబ్ రిజిస్ట్రార్లు రెండేళ్లలో బినామీల పేరుతో ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములను కొనుగోలు చేసినా వారిపై తూతూమంత్రంగా ఏసీబీ దాడులు చేయించి వారిని అలాగే కొనసాగించడంపై అనేక విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ‘‘మంత్రి నాకు క్లోజ్ అందుకే ఏపికి వెళ్లాల్సి ఉన్నా, కేసులు వేసినా నేను ఇక్కడే ఉంటున్నా’’ అని చెబుకు తిరుగుతున్నారని తెలిసింది. గ్రేడ్ 1 సబ్ రిజిస్ట్రార్ సురేందర్ నాయక్ , అశోక్ ని ఆంధ్రప్రదేశ్ కి పంపాలని కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు తీర్పు ఇస్తే అశోక్‌ను ఆంధ్రప్రదేశ్‌కు, సురేందర్‌ను రెవెన్యూ డిపార్ట్మెంట్‌కు పంపించాల్సి ఉంది. చిట్టిమల్ల అశోక్ ఈ కేసు విషయంలో ఆ శాఖ ఉన్నతాధికారులను కోర్టులో కౌంటర్ వేయకుండా నెలకు 5 లక్షల రూపాయలను ముట్టచెబుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతోపాటు రెండేళ్లుగా ఆయన మేడ్చల్ మల్కాజిగిరిలో ప్రభుత్వ భూములను బై నెంబర్ వేసి కోట్లు కొల్లగొట్టినా, రియల్ వ్యాపారం చేస్తున్నా ఆయనపై చర్యలు చేపట్టపోవడంలో ఉన్న మతలబు ఏంటని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో కొందరి అవినీతిపై వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిట్టిమల్ల అశోక్ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. మంత్రి తనకు చాలా క్లోజ్ అని ఆయనకు తెలియకుండా తాను ఏమీ చేయనని చిట్టిమల్ల చెప్పుకోవడంపై ఉద్యోగులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

రూ.200 కోట్లు కొల్లగొట్టినా సంతోష్‌పై చర్యలు ఎందుకు తీసుకోరు?

గతంలో రంగారెడ్డి డీఆర్ పని చేసిన సంతోష్ రెడ్డి విషయంలోనూ మంత్రి పొంగులేటి ఎలాంటి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకోవడంపై ఆ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సంతోష్ సుమారుగా ప్రభుత్వ భూములను వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించడం, కోర్టు కేసుల్లోనూ ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయించడం, వాల్యూడేషన్ పేరుతో నెలకు కోటి రూపాయలను వసూళ్లు చేయడం లాంటి ఫిర్యాదుల నేపథ్యంలో సస్పెండ్ చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించినా ఆ శాఖ ఐజీ పట్టించుకోలేదన్న విమర్శలు వినిపించాయి. సంతోష్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు అధికం కావడంతో గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో సంబంధిత మంత్రి పొంగులేటికి తెలియకుండానే డిపార్ట్మెంట్ రిలీవ్ అయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సైబరాబాద్ వాటర్ బోర్డులో రాత్రికిరాత్రే ఆర్డర్ తెచ్చుకోవడం పొంగులేటి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. తనకు తెలియకుండానే సంతోష్ రెడ్డిని రిలీవ్ ఎందుకు చేశారని ఐజీని ప్రశ్నించినా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం. అయితే, మంత్రి పొంగులేటికి తెలియకుండానే సంతోష్ రెడ్డి ఈ డిపార్ట్మెంట్ నుంచి వెళ్లిపోయారా లేదా అన్నది ప్రస్తుతం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే, డీఆర్‌గా ఈ శాఖ నుంచి వెళ్లిపోయిన ఆయనకి 2026, మే నెలలో డీఐజీగా పదోన్నతి కట్టబెట్టడం ఆ శాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా రూ.200 కోట్లను సంతోష్ రెడ్డి కొల్లగొట్టారని ఆయనపై భారీగా ఫిర్యాదులు ఉన్నా ఏసీబీ దాడులు ఎందుకు జరగలేదని ప్రశ్నిస్తున్నారు.

పీఏ వెంకట్ రెడ్డి ముడుపుల బాగోతం

రెండేళ్ల క్రితం డీఆర్‌లను, సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసి శాఖను ప్రక్షాళన చేశానని మంత్రి పొంగులేటి చెప్పారు. కానీ, ఈ రెండేళ్లుగా ఎంతమంది భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఓడీల పేరుతో వచ్చిన సబ్ రిజిస్ట్రార్లు ఏ విధంగా బినామీల పేరుపై కోట్లను సంపాదిస్తున్నారన్న విషయాలపై మంత్రికి ఫిర్యాదులు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆ శాఖ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి దగ్గర పని చేసే పీఏ వెంకట్ రెడ్డి సైతం సబ్ రిజిస్ట్రార్ల నుంచి లక్షల రూపాయలను వసూళ్లు చేస్తున్నారని ఫిర్యాదు అందినా ఎందుకు ఆయన్ను ఆ స్థానం నుంచి తప్పించడం లేదని అడుగుతున్నారు. సబ్ రిజిస్ట్రార్లపై అవినీతి ఆరోపణలు రాగానే వెంటనే ఈ పీఏ వెంకట్ రెడ్డి, వారికి ఫోన్ చేసి ముడుపులు తీసుకున్నట్టుగా మంత్రికి ఫిర్యాదులు వచ్చినా ఆయన్ను ఎందుకు కొనసాగిస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రస్తుతం ముడుపులు ఇచ్చిన సబ్ రిజిస్ట్రార్లు ఈ పీఏ వెంకట్ రెడ్డి దృష్టిలో మంచివాళ్లుగా చలామణీ అవుతున్నారు. వారి మంచితనం గురించి మంత్రి పొంగులేటికి చెబుతూ బదిలీ కాకుండా కాపాడి లక్షల రూపాయల ముడుపులను తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ పీఏ వెంకట్ రెడ్డి హరీష్ రావు దగ్గర కూడా పని చేశారు. అక్కడ కూడా ఇలాగే అవకతవకలు పాల్పడితే తొలగించారు.

#www.swechaanews.com#exclusive/registration department-correption-special story
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి