దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్న వైఎస్ జగన్, అక్కడ దివంగత నేత సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.
ఈ సందర్భంగా తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కాసేపు మౌనం పాటించారు. జగన్‌తో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయ పరిసర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలను చేపట్టాయి.












