సినిమా

Siddhu Jonnalagadda: సుకుమార్ తో సిద్ధు సినిమా..దర్శకుడెవరంటే!

రచన: Desk 74 నిమిషాల పఠనం

Siddu Jonnalagadda: గుంటూరు టాకీస్, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, తెలుసు కదా సినిమాలతో తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. స్టార్ బాయ్ అంటూ అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న సిద్ధు తన మేనరిజంతో బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

Siddhu Jonnalagadda: గుంటూరు టాకీస్, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, తెలుసు కదా సినిమాలతో తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. స్టార్ బాయ్ అంటూ అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న సిద్ధు తన మేనరిజంతో బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఇలాంటి, ఎనర్జిటిక్ హీరోకి సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తోడైతే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో సిద్ధు ఓ సినిమాను చేయబోతున్నాడనేది ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ఇప్పటికే, సుకుమార్ మైత్రీ వారితో కలిసి మిడ్ రేంజ్ సినిమాలతో పాటు పెద్ది లాంటి భారీ పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సిద్ధు కోసం ఓ కథను సుకుమార్ అండ్ టీమ్ రెడీ చేస్తున్నారట. ఈ మూవీతో సుకుమార్ సోదరుడు బాబీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్టుగా తెలుస్తోంది.

త్వరలోనే, ఈ క్రేజీ కాంబోకి సంబందించిన ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం సుకుమార్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాడు. త్వరలో వీరి సినిమా ప్రారంభం కానుంది. అలాగే, ఈ సినిమాను లాంఛ్ చేయనున్నారట. ప్రస్తుతం, సిద్ధు కూడా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. అలాగే, ఆర్ జె స్వరూప్ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా చేస్తున్నాడు.

ఇదే క్రమంలో సుకుమార్ రైటింగ్స్‌లో, సుకుమార్ అందించే కథలో సిద్ధు నటించడానికి రెడీ అవుతున్నాడు. సుక్కూ కథ అంటే బోలెడన్నీ లెక్కలు..ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఇలాంటి కథకి సిద్ధు లాంటి ఎనర్జీ స్టార్ తోడైతే ఆ సినిమా డీజే టిల్లు, టిల్లూ స్క్వేర్ లని మించి ఉంటుందనడంలో సందేహం లేదు. అన్నట్టు..సిద్ధు టిల్లు క్యూబ్ కథను కూడా రెడీ చేస్తున్నాడు. త్వరలో, ఈ మూవీ అప్‌డేట్స్ కూడా రానున్నాయి.

#sukumar#siddujonnalagadda#bobby#latestnews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి