భార్యలు భర్తలను హత్య చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల పుణేలో కాబోయే భర్త కేతన్‌ను సియా, ఆమె ప్రియుడు కలిసి కొండ మీద నుంచి తోసేసి మర్డర్ చేసిన ఘటన మరువక ముందే..తెలంగాణలో మరో ఘటన వెలుగుచూసింది.వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భార్య తన ప్రియుడితో కలసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను అతికిరాతకంగా హత్య చేసింది.
వివరాల్లోకివెళితే.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాలకల్ గ్రామానికి చెందిన ప్రశాంత్, సంధ్య దంపతులు..కుటుంబ పోషణ కోసం ప్రశాంత్ గల్ఫ్ దేశాలకు వెల్లగా.. బంటి అనే యువకుడితో భార్య సంధ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నది.ఇటీవల ప్రశాంత్ గల్ఫ్ నుంచి తిరిగి రాగా, భార్య వివాహేతర సంబంధం విషయం తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సంధ్య తన ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది.
గత నెల 30న ప్రియుడు బంటితో కలిసి భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి ఇంటిపై నుండి కిందికి తోసేసింది.అయినప్పటికీ మరణించకపోవడంతో భర్త నరాల్లోకి నేరుగా టాయిలెట్ క్లీనర్ (హార్పిక్)ను ఇంజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు మద్యం తాగి తన భర్త పడిపోయాయని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది. చికిత్స పొందుతూ ప్రశాంత్ మరణించగా.. సంధ్య మీద అనుమానంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శవాన్ని పోస్ట్‌మార్టం చేయగా అసలు గుట్టు బయటపడింది. అనంతరం సంధ్య,ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి స్టైల్లో విచారించగా అసలు నిజాన్ని ఒప్పుకున్నారు. ఈ విషయం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.












