ఓ ప్రజాప్రతినిధి బాధ్యతలు మరువడమే కాకుండా ఒళ్లు కూడా మరిచిపోయి దారుణానికి ఒడిగట్టాడు. అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి ఒంటి మీద నూలు పోగుకూడా లేకుండా ఓ ఇంట్లోకి చొరబడటమే కాకుండా నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చాగల్లు గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకివెళితే..చాగల్లు పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ సంపత్ రాజ్.. అర్ధరాత్రి మద్యం మత్తులో ఒంటిపై నూలుపోగు లేకుండా స్థానికంగా ఉండే ఒక వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రిస్తున్న ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.వారిని చూసి భయపడిన కౌన్సిలర్ సంపత్ రాజ్ నగ్నంగానే బాత్రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు.
స్థానికులు బాత్రూమ్ బయట నుంచి తాళం వేసి స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ప్రస్తుతం ఈ విషయం స్టేషన్ ఘనపూర్‌లో సంచలనంగా మారింది.












